ఖజానా ఖాళీ… జీతాలు, పెన్షన్ల కోసం ఏపీ ప్రభుత్వం తిప్పలు.. అప్పు కోసం పాట్లు

AP Govt trying for debt to give salaries and pensions

అసలే కొత్త రాష్ట్రం. ఎక్కువ ఆదాయం వచ్చే హైదరాబాదేమో తెలంగాణకు పోయింది. ఇక ఏపీకి ఉన్న ఆదాయ వనరు ఏంటి? ఏదీ లేదు. పోనీ.. కొత్త రాష్ట్రాన్ని కేంద్రం ఏమైనా ఆదుకుంటున్నదా? అంటే అదీ లేదు. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రాన్ని ఎలా పాలించాలి? అందులోనూ గత ప్రభుత్వం 2 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎలా నెట్టుకురావాలి.. ఇదే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మదిలో మెదులుతున్న ఆలోచన.

AP Govt trying for debt to give salaries and pensions
AP Govt trying for debt to give salaries and pensions

2014లో ఉమ్మడి ఏపీ విడిపోయాక తొలిసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ… ఐదేళ్లో అమరావతి సంక్షేమం పేరుతో సుమారు 2 లక్షల రూపాయల అప్పు చేసింది. అంత భారీ మొత్తంలో చేసిన అప్పును తీర్చాలంటే ఇప్పుడు అయ్యే పనేనా?

అందులోనూ… వచ్చీరాగానే జగన్  ప్రభుత్వం కూడా నవరత్నాల పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. అప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టేశారు.

దీంతో అప్పులతోనే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చే పొజిషన్ లో కూడా ప్రభుత్వం లేదు ఇప్పుడు.

నెలనెలా ఇచ్చే జీతాల కోసం కూడా అప్పు చేయడానికే ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. దాని కోసమే కొంతమంది మంత్రుల సంతకాలతో కూడిన ఆర్డినెన్స్ దస్త్రాన్ని గవర్నర్ కు పంపించిందట.

నిజానికి ఏ రాష్ట్రానికైనా కొత్తగా అప్పు పుట్టాలన్నా… ఎక్కువ మొత్తంలో అప్పు కావాలన్నా.. ఎఫ్ఆర్బీఎం పరిమితి ఎక్కువ ఉండాలి. కానీ.. ప్రస్తుతం ఉన్న ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3 నుంచి 5 శాతానికి పెంచుతూ చట్ట సవరణ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచితే అప్పు కుప్పలుగా వచ్చి పడుతుంది. ఆ అప్పుతోనే రాష్ట్రాన్ని నెట్టుకురావాలని ప్రయత్నిస్తోంది.

అలాగే కేంద్రం అనుమతితో ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కనీసం 3 శాతం అప్పు తీసుకోవచ్చు. దాన్నే ఎఫ్ఆర్బీఎం పరిమితి అంటారు. అది 5 శాతానికి పెరిగితే.. ఇక డోకా ఉండదు. కొన్ని ఏళ్ల వరకు రాష్ట్రాన్ని ఎలాగోలా నడిపించవచ్చు. ఎలాగూ మరో నాలుగేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. అప్పటి వరకు బండి నడిస్తే చాలు.. అన్న ఉద్దేశంలో ఏపీ సీఎం జగన్ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. చూద్దాం మరి.. కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతి ఇస్తుందా? రాష్ట్రానికి అప్పు పుడుతుందా? లేదా ఇంకేవైనా మార్గాలను ఏపీ ప్రభుత్వం అన్వేషించాలా?