స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ఉత్తర్వులు జారీ చేసిన జగన్ ప్రభుత్వం !

is ap cm ys jagan neglecting party leaders?

స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొన్ని రోజులుగా వివాదం జరుతుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంటే ప్రభుత్వం దీనికి ససేమిరా అంటోంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా లేమని ఏపీ ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది.

ap cm ys jagan serious on ycp leaders

స్థానిక సంస్థల పై క్లారిటీ లేకపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్పీ, ఎంపిపిల స్థానం లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగీస్తూ ఈ ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీ, ఎంపీపీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన చేస్తామని ప్రకటించింది. మరో ఆరు నెలల పాటు పరిపాలన పొడగిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. మండల పరిషత్‌లో జూలై 3, జిల్లా పరిషత్ లో జూలై 4 వరకు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుందన్నారు.

ఈ మేరకు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశాయి. ఇక మూడు నాలుగు రోజుల్లో నిమ్మగడ్డను కలవాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.