జగన్ ప్రభుత్వం వైవిధ్యభరితమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తున్నారు. మొన్ననే సమగ్ర భూసర్వేకు శ్రీకారం చుట్టిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత పటిష్టం చేస్తూ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీ పైనే మంత్రివర్గం చర్చించి మంత్రివర్గం అమోదం తెలిపింది. రైతుకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని స్పష్టం చేశారు.
అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఈ పథకం వల్ల రైతు తాను వాడుకున్న కరెంట్ కు రైతే బిల్లు చెల్లించాలి. కానీ రైతు చెల్లించే ఆ బిల్లును ప్రభుత్వమే రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకం వల్ల రైతుల మీద పైసా భారం కూడా పడదని, రైతులకు ఎప్పటికి ఉచితంగానే విద్యుత్ ఇస్తామని, ఈ నూతన ప్రక్రియ వల్ల రైతులకు మరింత భాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని వెల్లడించారు.
ఇందులో భాగంగా వైఎస్సార్ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం డిసెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయనున్నారు. భూమిని కౌలుకిచ్చిన రైతులకూ ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ఫీడర్ల అప్‌గ్రేడేషన్‌కు రూ.1700 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ప్రతి పక్షాల నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు.
ఇలా వచ్చే డబ్బును రైతుల ఇతర అవసరాలకు కూడా వాడుకునే అవకాశం ఉంది. మొన్నటి వరకు రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని అందరు అన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు హగ్ ఇస్తున్నారు. ఈ నిర్ణయంతో రైతుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల మరింత నమ్మకం పెరిగింది. అమరావతి రైతుల ధర్నా వల్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వచ్చిన నెగిటివిటీని ఈ నిర్ణయం కొంతవరకు తగ్గించిందనే చెప్పాలి.