ఏపీలో ప్రస్తుతం ఉన్న హాట్ టాపిక్ ఒక్కటే అదే దేవాలయాల మీద జరిగే దాడులు. వరుసగా జరుగుతున్న దాడులను గమనిస్తే.. ఇదంతా కావాలని పక్కాగా ప్లాన్ చేసి చేస్తున్న అటాక్ లా అనిపిస్తోంది. ఇది అంత చిన్న విషయం కూడా కాదు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా.. హిందూ దేవాలయాలపై ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా దాడులు చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది హిందూ మతాన్ని అవమానించినట్టే. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కూడా. ఇటువంటి కేసులను సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా స్పెషల్ టీమ్ ఉండాలి. ఆ టీమ్.. ప్రతి చిన్న విషయాన్ని గమనించి.. అసలు దోషులను పట్టుకోవాలి. అప్పుడే ఇటువంటి ఘటనలకు పుల్ స్టాప్ పడేది.
అయితే.. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు సాధారణంగా సీబీఐకి ఇటువంటి కేసులను అప్పగిస్తారు. దానికి ముందడుగు వేయాల్సింది ఏపీ ప్రభుత్వమే. కానీ.. ఎందుకు సీఎం జగన్ ఆ కోణంలో ఆలోచించడం లేదు. దేవాలయాల ఇష్యూ చాల పెద్దది అవుతోంది. అందులోనూ సీఎం జగన్ మీదికే అన్ని వేళ్లు పోతున్నాయి. ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ఒక్కటై.. సీఎం జగన్ ను విమర్శిస్తున్నాయి.
ఇటువంటి సమయంలో ఖచ్చితంగా కేంద్రం సహాయం తీసుకొని అయినా.. నిజం బయటపడేందుకు స్పెషల్ టీమ్ తో దర్యాప్తు చేయించాల్సిన బాధ్యత సీఎం జగన్ ది. కానీ.. ఆయన కేవలం ఆలయాల్లో రక్షణ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకోసారి ఇటువంటి ఘటనలు రిపీట్ అయితే చర్యలు తీవ్రంగా ఉంటాయంటూ ఏదేదో చెబుతున్నా.. దర్యాప్తు అనేది ఈ కేసులో సరిగ్గా జరగడం లేదు. అందుకే.. రాష్ట్రంలో ఇంకా అటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
పరిస్థితి చేయి దాటి పోతే.. అందరూ చివరకు నిందించేది.. విమర్శించేది.. ప్రశ్నించేది సీఎం జగన్ ను.. ప్రభుత్వాన్ని తప్పితే మరెవరినో కాదు. ఇప్పటికైనా సీఎం జగన్ వెంటనే స్పందించి.. దేవాలయాలపై దాడుల ఘటనలపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థల సహాయమో లేక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయడమో చేయాలి.. అంటూ ఏపీ ప్రజలు కోరుతున్నారు.