విశాఖ నుంచి జగన్ పాలన లేనట్టే.. ఏపీ సీఎం జగన్ ఏం చేస్తారో?

YSRCP

ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ నుంచి దసరా పండుగ నుంచి పాలన మొదలుపెడతారని గతంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని అధికారికంగా తేలిపోయింది. విశాఖ నుంచి జగన్ పాలన ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఏపీ సీఎం జగన్ రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చూడాల్సి ఉంది. రాజధానిని ఫైనల్ చేయకపోవడం జగన్ సర్కార్ కు మైనస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

రాజధాని లేకపోవడం వల్ల రాష్ట్రం అభివృద్ధి జరగడం సాధ్యం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజధాని లేకపోవడం వల్ల జగన్ సర్కార్ పాలనపై ఎన్నో విమర్శలు వ్యక్తమవుతున్నాయనే సంగతి తెలిసిందే. అమరావతి నుంచి జగన్ పాలన సాగిస్తున్నా జగన్ మనసు మాత్రం విశాఖపై ఉంది. విశాఖ రాజధానిగా ఫిక్స్ అయితే మాత్రం ఏపీ అభివృద్ధి ఊహించని స్థాయిలో జరుగుతుందని జగన్ భావిస్తుండటం గమనార్హం.

దేశంలో మరే రాష్ట్రం ఎదుర్కోని సమస్యను ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటోంది. మరోవైపు తొలి ఏడాదే నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో నిర్ణయాలను తీసుకున్న జగన్ ఇప్పుడు మాత్రం ఉద్యోగాలను కల్పించే విషయంలో ఫెయిల్ అవుతూ విమర్శలను మూటగట్టుకుంటున్నారు. ఏపీ అప్పులపైనే ఆధారపడుతూ పాలన సాగిస్తుండటంపై కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పథకాలను అమలు చేస్తే మాత్రమే మంచి ముఖ్యమంత్రి అనిపించుకోరని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ విమర్శల విషయంలో జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. జగన్ ఏపీపై మాత్రమే దృష్టి పెట్టారు. భవిష్యత్తులో కూడా వైసీపీని ఇతర రాష్ట్రాల్లో బలోపేతం చేయాలనే ఆలోచన జగన్ కు అయితే లేదు.