సర్వేలను నమ్ముకుంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఏం జరుగుతుందో?

2024 ఎన్నికలకు మరో 15 నెలల సమయం మాత్రమే ఉంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు వ్యూహాల విషయంలో నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. అధికారంలోకి మళ్లీ రావాలనే లక్ష్యంతో పథకాల అమలు విషయంలో ఏ మాత్రం తప్పు జరగకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టడం గమనార్హం.

ఏ మాత్రం వ్యతిరేకత ఉన్నా వాళ్లకు మళ్లీ అవకాశాలు ఇవ్వడానికి జగన్ ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ విషయంలో కొంతమంది విమర్శలు చేస్తున్నా జగన్ నిర్ణయాలు మాత్రం మారడం లేదు. ఎమ్మెల్యేల పనితీరు గురించి సర్వేలు చేయిస్తూ ఆ సర్వేల ఆధారణంగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే సర్వేల ఫలితాలు అన్ని సందర్భాల్లో సరిగ్గా ఉంటాయని చెప్పాల్సిన అవసరం లేదు.

మరోవైపు జగన్ సైతం అధికారం విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. జగన్ కాన్ఫిడెన్స్ వల్ల వైసీపీకి మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో చూడాల్సి ఉంది. వైసీపీ నేతలు మాత్రం జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు.

జగన్ కొన్ని నిర్ణయాల విషయంలో మొండిగా ముందుకు వెళుతున్నారు. అనుకున్నది సాధించే వరకు వెనక్కు తగ్గకూడదని జగన్ భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాలలో గెలుపే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తుండగా ఎన్నికల ఫలితాలు జగన్ ఊహించే విధంగా ఉంటాయో జగన్ కు షాకిచ్చే విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.