నమ్మిన వాళ్లకు న్యాయం చేస్తున్న సీఎం జగన్.. బాబు, పవన్ లా కాదుగా?

CM YS Jagan Mohan Reddy

2019 ఎన్నికలకు ముందు వైసీపీ తరపున ప్రచారం చేసిన సినీ సెలబ్రిటీల జాబితా తక్కువే అనే సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీ తరపున ప్రచారం చేసిన సినీ సెలబ్రిటీలకు వరుసగా పదవులు దక్కుతున్నాయి. సీఎం జగన్ గుర్తింపు ఉన్న పదవులనే వారికి కేటాయిస్తూ ఉండటంతో జగన్ అభిమానులు సైతం సంతోషిస్తున్నారు. ఏపీ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మన్ గా పోసాని కృష్ణమురళి నియమితులయ్యారు.

కొన్నిరోజుల క్రితం అలీకి సలహాదారుడి పదవి ఇచ్చిన జగన్ పోసాని కృష్ణమురళికి కూడా పదవి ఇచ్చి న్యాయం చేశారు. సాధారణంగా చంద్రబాబు, పవన్ తమకు నమ్ముకున్న వాళ్లకు న్యాయం చెయ్యరని అపవాదు ఉంది. 2009 ఎన్నికల్లో ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకున్న చంద్రబాబు ఎన్నికల ఫలితాల తర్వాత తారక్ తో ఏ విధంగా వ్యవహరించారో తెలిసిందే.

జనసేన పార్టీ తరపున ఒకే ఒక ఎమ్మెల్యే గెలవగా ఆ ఎమ్మెల్యేకు పవన్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనున్నారు. జగన్ మాత్రం నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేస్తూ మంచి సీఎంగా పొలిటికల్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా పోసాని కృష్ణమురళి ఎన్నో సందర్భాల్లో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

టీడీపీ, జనసేన పార్టీలపై పోసాని తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. పదవి రావడంతో ప్రతిపక్ష పార్టీల విషయంలో పోసాని దూకుడు పెంచే ఛాన్స్ అయితే ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అలీ భావిస్తుండగా పోసాని సైతం ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.