వైసీపీ ఎమ్మెల్యేలను నమ్మని టీడీపీ.. పార్టీ వీడితే నష్టం తప్పదా?

2019 ఎన్నికలకు ముందు చాలామంది వైసీపీ నేతలు వైసీపీలో మంచి గుర్తింపు ఉన్నా డబ్బుకు ఆశ పడి పార్టీకి దూరమయ్యారు. వాళ్లు టీడీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేయగా వాళ్లలో ఎవరూ ఎమ్మెల్యేగా గెలవలేదు. అయితే వైసీపీ నుంచి తమ పార్టీలో చేరతామని చెబుతున్న ఎమ్మెల్యేలను టీడీపీ నమ్మడం లేదు. వైసీపీని వీడితే మాత్రం ఆ నేతలకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

2024 ఎన్నికల్లో కూడా జగన్ కు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ కొన్ని తప్పులు చేసినా ఆ తప్పులు అధికారానికి దూరం చేసే రేంజ్ తప్పులు అయితే కావని కామెంట్లు వినిపిస్తున్నాయి. పార్టీని వీడే ఎమ్మెల్యేలు అన్ని విషయాలను ఆలోచించుకుని జాగ్రత్త పడితే మంచిది. నమ్మకద్రోహం చేసిన ఎమ్మెల్యేలను జగన్ అస్సలు క్షమించరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పార్టీ వీడే ఎమ్మెల్యేలు రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తామని భావిస్తే భ్రమే అవుతుంది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలలో చాలామంది ఎమ్మెల్యేలు కేవలం జగన్ వేవ్ వల్ల గెలిచారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడాలని జగన్ ఎప్పుడూ కోరుకోలేదు. జగన్ తో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించుకుని ఉంటే బాగుండేది. జగన్ కు దూరం కావడం వల్ల రాబోయే రోజుల్లో పార్టీకి కూడా దూరం కావాల్సి వస్తుంది.

మరోవైపు ఈ తరహా ఎమ్మెల్యేలను జగన్ ముందుగానే గుర్తించి వాళ్లను పార్టీకి దూరం చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు జగన్ కు వాస్తవాలు తెలియజేయడంలో సాక్షి పత్రిక ఒకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాల దుష్ప్రచారం విషయంలో జగన్ సర్కార్ మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది.