జూనియర్ ఎన్టీఆర్ స్నేహితునికి టికెట్ ఇస్తున్న జగన్.. అసలు ప్లాన్ ఇదేనా?

ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాలలో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ సైతం అభ్యర్థుల ఎంపికలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడికి టికెట్ ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. ఆ స్నేహితుడు మరెవరో కాదు వల్లభనేని వంశీ.

జూనియర్ ఎన్టీఆర్ వల్లభనేని వంశీ కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి. తారక్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాలకు వంశీ నిర్మాతగా వ్యవహరించారు. గత కొన్ని నెలలుగా వంశీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ ఎమ్మెల్యేకు జగన్ టికెట్ ఫిక్స్ చేశారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

వల్లభనేని వంశీ 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనున్నారు. అయితే వంశీ పోటీ చేస్తానని చెబుతున్నా నియోజకవర్గంలో వంశీకి ఇతర వైసీపీ నేతల నుంచి అనుకూల పరిస్థితులు అయితే లేవు. వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే తాము సహాయసహకారాలు అందించబోమని పలువురు నేతలు చెబుతుండటం గమనార్హం. వల్లభనేని వంశీ వైసీపీ తరపున పోటీ చేస్తే తారక్ ఫ్యాన్స్ సపోర్ట్ ఆయనకు ఉంటుందో లేదో అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

వల్లభనేని వంశీకే జగన్ టికెట్ ఇస్తారని కొడాలి నాని సైతం ఒక సందర్భంలో వెల్లడించారు. పొలిటికల్ గా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో జగన్ నిర్ణయాలు అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. జగన్ 175 సీట్లలో విజయం సాధించాలని నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.