పాదయాత్రతో పరువు పోగొట్టుకుంటున్న లోకేశ్.. ఆ రికార్డును సాధిస్తారా?

nara-lokesh-twitter-1165602-1669366852

తెలుగు రాష్ట్రాల్లో ఎవరు పాదయాత్ర చేసినా వాళ్లు అధికారంలోకి రావడం గ్యారంటీ అని పొలిటికల్ వర్గాల్లో అభిప్రాయం ఉంది. అయితె లోకేశ్ మాత్రం ఈ రికార్డును సాధించడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి నామమాత్రపు స్పందన కూడా లేదు. లోకేశ్ చుట్టూ ఉన్నవాళ్లలో ఎక్కువమంది టీడీపీ నేతలే కాగా సామాన్య ప్రజలు లోకేశ్ పాదయాత్రపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు.

400 రోజుల పాదయాత్ర అంటూ లోకేశ్ తెగ హడావిడి చేసినా ఈ పాదయాత్ర నాలుగు రోజుల పాదయాత్రగా మిగిలిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. లోకేశ్ పాదయాత్ర చేసినా ఎమ్మెల్యే కాలేకపోయాననే అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం గ్యారంటీ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీ లాభం చేకూరడం అసాధ్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు టీడీపీ పరిమితం కాగా 2024 ఎన్నికల్లో బెటర్ రిజల్ట్స్ వస్తాయి తప్ప టీడీపీకి మరో మెరుగైన ఫలితాలు అసాధ్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి. పొత్తులపై ఆధారపడ్డ టీడీపీకి మరోసారి దారుణమైన ఫలితాలు గ్యారంటీ అని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లోకేశ్ పాదయాత్రలో కేవలం 40 నుంచి 50 మంది ఉండటం గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ట్రోల్స్ గురించి లోకేశ్ నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాల్సి ఉంది.