AP: విజయవాడ నగరం నడిబొడ్డున గత ఏడాది జనవరి నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా 26 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. నగరం మధ్యలో ఉన్న పిడబ్ల్యూడి గ్రౌండ్స్‌లో 125 అడుగుల విగ్రహాన్ని 80 అడుగుల ఎత్తైన పీఠంపై ఏర్పాటు చేశారు. ఇలా ఈ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ఏర్పాటు చేయటం వల్ల రాజకీయ లబ్ధి పొందవచ్చు అన్న ఆలోచనతో గత ఏడాది ఎన్నికలకు ముందు సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జగన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఇక ఇక్కడ ఉన్నటువంటి 19ఎకరాల స్వరాజ్య మైదానంలో స్మృతి వనం ఏర్పాటు చేసి ఇదొక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. ఇక ఇక్కడికి వెళ్లాలి అంటే ఐదు రూపాయలు చొప్పున టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది అయితే ఇలా ఈ స్మృతి వన నిర్వహణ కోసం సుమారు నెలకు 21 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఇంత డబ్బును వెచ్చించడం తమకు భారం అవుతోందని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం భావిస్తున్నాయి.
ఈ విగ్రహాన్ని చూడటానికి వస్తున్నటువంటి సందర్శకులు ఎంట్రీ ఫీజు ద్వారా నెలకు కేవలం 5 నుంచి 6 లక్షల రూపాయలు మాత్రమే వస్తుంది మిగిలినది మొత్తం తమకు భారంగా మారిందని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయకముందు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉండేవారు తద్వారా తమకు ఆదాయం ఉండేదని తెలిపారు. ఈ ప్రాంగణం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ చేతిలోకి వచ్చాక కొందరు ఆదాయం కోల్పోయారు. ఇటీవల విగ్రహ ప్రాంగణంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడంతో గొడవ మొదలైంది.
ఇలా అంబేద్కర్ స్మృతి వనం ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేకపోయినా పెద్ద ఎత్తున నిర్వహణ కోసం ఖర్చు చేయాల్సి వస్తున్న నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకోవడంపై ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ స్మృతి వన నిర్వహణను ప్రైవేట్ వారికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి.