సీఎం వైఎస్ జగన్‌పై జనసేన నుంచి మరో కార్టూన్.!

Janasena

అసెంబ్లీలో మాట్లాడుతున్నారు.. ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.. జనంలోకీ వెళుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కానీ, పవన్ కళ్యాణ్ ఎక్కడ.? అప్పుడప్పుడూ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పోతున్నారాయన. జనసేన నేతలకు అందుబాటులో వుండరు.. జనసైనికులకు అస్సలే కనబడరు. ఆర్నెళ్ళకో, ఏడాదికో ఓ సారి జనంలోకి వస్తుంటారంతే.!

ఇప్పుడిదంతా ఎందుకంటే, ‘సర్వేలన్నీ వ్యతిరేకంగా వున్నాయని సార్ మూడ్ ఆఫ్‌లో వున్నారు, ఇప్పుడెవర్నీ కలవరు..’ అంటూ వైఎస్ జగన్ మీద జనసేన పార్టీ నుంచి ఓ కార్టూన్ వచ్చింది. అందులో హెలికాప్టర్ బొమ్మ కూడా షరామామూలుగానే వుందనుకోండి.. అది వేరే సంగతి.

వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 45 నుంచి 67 సీట్లు వస్తాయంటూ జనసేనాని నిన్ననే జోస్యం చెప్పిన విషయం విదితమే. ఇప్పుడేమో 40 నుంచి 65 సీట్లు మాత్రమే.. అంటూ కార్టూన్ బయటకు వచ్చింది జనసేన నుంచి. సరే, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది వేరే చర్చ. ముందైతే, జనసేన పార్టీ తన గురించి తాను ఆలోచించుకోవాలి కదా.!

జనసేన పార్టీ ఇటీవలి కాలంలో ఏమన్నాసొంత సర్వే చేయించుకుందా.? ఆ సర్వేలో ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై ఆ పార్టీకి ఏమన్నా స్పష్టత వచ్చిందా.? లేదా.? ఇంతకీ, అధినేత జనసేన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.? ఆయనేమన్నా గెలిచే అవకాశం వుందా.? లేదా.? ఇలాంటి ప్రశ్నలు సహజంగానే జనసేన మీదకు వస్తాయ్.!

అయినా, ఇలాంటి కార్టూన్లతో ఎన్నాళ్ళని జనసేనాని రాజకీయం చేస్తారట.? విజయదశమి వెళ్ళాక జనంలో వుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడేమో, అది కాస్తా వాయిదా వేసుకున్నట్లు సెలవిచ్చారు. ఇది కదా ‘మూడ్ ఆఫ్ రాజకీయం’ అంటే.!