చంద్రబాబు సింపుల్‌గా అరెస్టయి, జైల్లో కూర్చున్నారు.! కానీ, పవన్ కళ్యాణ్ ప్రతిఘటించి, నిలబడి, రోడ్డు మీద పడుకుని కూడా హక్కులు సాధించుకున్నారు.! ఆ కేసు వేరు, ఈ వ్యవహారం వేరు.! కానీ, జనాల్లోకి సంకేతం వేరేలా వెళ్ళింది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయ్యాక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేసిన వ్యూహాత్మక అడుగు, జనసేన పార్టీ మైలేజ్‌ని అనూహ్యంగా పెంచేసింది. చంద్రబాబు కోసం పెద్దయెత్తున జనం తరలి రాలేకపోయారు. అదే, పవన్ కళ్యాణ్ విషయంలో ఇంకోలా జరిగింది.
అది అరెస్టు.. ఇది, జస్ట్ అడ్డుకునే వ్యవహారం. అరెస్టులో వుండాల్సిన హడావిడి కంటే మించి అడ్డుకోవడంలో కనిపించింది. కాదు కాదు, జనసేన ఆ స్థాయిలో హంగామా క్రియేట్ చేయగలిగింది. వైసీపీ కూడా ఆ ఛాన్స్ జనసేనానికి ఇచ్చింది. ప్రత్యేక విమానాన్ని అడ్డుకోకపోయి వుంటే, ఏం జరిగేదో.. విజయవాడలో హైడ్రామా నడిచేదా.?
ఏదైతేనేం, చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మద్దతిచ్చేసరికి, ‘అన్న పవన్ కళ్యాణ్’ అంటూ తమ్ముడు లోకేష్ మురిసిపోతున్నారు. చిత్రంగా, కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్‌ని ఇప్పుడు ఓన్ చేసేసుకుంటోంది. ‘జూనియర్ ఎన్టీయార్ రాలేదు.. పవన్ కళ్యాణ్ వచ్చాడు’ అంటోంది కమ్మ సామాజిక వర్గం.
ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోయాయ్. ఈసారికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా మద్దతిద్దాం.. అనే స్థాయికి టీడీపీ క్యాడర్‌లో, కమ్మ సామాజిక వర్గంలో తాత్కాలిక అభిప్రాయం కనిపించింది. కానీ, అలాంటివి ఏమన్నా వుంటే, వాటిని చెరిపేయడం చంద్రబాబుకి పెద్ద కష్టం కాదు.
ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. పవన్ కళ్యాణ్‌కి పెరిగిన పొలిటికల్ మైలేజ్ నిలబడొచ్చు.. నిలబడితే మాత్రం, ఆ క్రెడిట్ చంద్రబాబుది కాదు, వైఎస్ జగన్‌దే.!