ఆంధ్ర ప్రదేశ్ లోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు మీద బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తాజాగా నోరు విప్పారు. ఈ దాడులు గత 18 నెలలుగా నిరంతరం జరుగుతున్నాయి అని ఆయన అన్నారు. బిజెపి చేస్తున్న ఉద్యమాన్ని అణచి వేస్తున్నారు అని మండిపడ్డారు. 127 ఘటనలు జరిగితే ఒక్కరిని అరెస్టు చేయలేదు అని ఆరోపించారు. మంత్రులు ఎదురు దాడి చేయడం తప్ప అరెస్టు చేయడం లేదు అని అన్నారు. ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని ఆయన మండిపడ్డారు. ఆలయాల పై దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని నిలదీశారు.
ప్రభుత్వ అండదండలతోనే దాడులు జరుగుతున్నాయి అని అన్నారు. 127 విగ్రహాలను ప్రభుత్వ ఖర్చుతో పునః ప్రతిష్టించాలి అని ఆయన డిమాండ్ చేసారు. మత మార్పిడిలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది అని ఆయన ఆరోపించారు. కలెక్టర్ స్థాయి అధికారులు మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్నారు అన్నారు. భారతీయులందరిని రామతీర్థానికి అనుమతించాలి అని ఆయన డిమాండ్ చేసారు. అభివృద్ధి పేరుతో హిందుమతాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు అని అన్నారు. ఈ పద్దెనిమిది నెలల్లో చేసిన అభివృద్ధి ఏంటి, అభివృద్ధి ని అడ్డుకున్నది ఎవరూ అని ప్రశ్నించారు.
హిందూ దేవాలయాలపై దాడులు జరగకుండా చూడాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాము అని, రెండు కుల, ప్రాంతీయ పార్టీలు తోక పార్టీలుగా వ్యవహరిస్తున్నాయి అని ఆయన మండిపడ్డారు. జగన్, చంద్రబాబు లు బిజెపిని తోక పార్టీలతో పోల్చవద్దు అని ఆయన సూచించారు. బిజెపి జనసేన ఆధ్వర్యంలో రేపు మరోసారి ఛలో రామతీర్థ ఉంది అని, హిందువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని ఆయన సూచించారు. ఖబడ్దార్ జగన్ మోహన్ రెడ్డి అని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత హిందు దేవాలయాపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి అని ఆయన ఆరోపించారు. రాష్ట్రం లో 120కి పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి అని, విగ్రహాలపై దాడులు చేసిన ఎవ్వరిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదు అన్నారు.