కృష్ణా జిల్లా పామర్రులో సోషల్ మీడియా ఆర్గనైజర్ నాగబాబు పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతల అవినీతి, అమరావతిలో జరుగుతున్న అక్రమాలను పోస్టు చేసేవాడని దీంతో కొంత మంది టిడిపి నేతలు పోలీసుల పై ఒత్తిడి తేవడంతో పోలీసులు నాగబాబు పై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేశారని ఆర్గనైజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పోస్టింగ్ ల పట్ల పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పోలీసుల పై ఒత్తిడి తెచ్చారని ఆమె ఒత్తిడి మేరకే పోలీసులు కేసు నమోదు చేశారని వైసిపి నేతలు విమర్శించారు. నాగబాబు అరెస్టు పై సోషల్ మీడియా ఆర్గనైజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమ కేసును నమోదు చేయడాన్ని వైసీపీ విజయవాడ, మచిలీ పట్నం పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, పార్థసారధి, పామర్రు ఇంచార్జీ కైలా అనీల్ కుమార్ ఖండించారు. సోషల్ మీడియా గొంతు నొక్కెందుకు టిడిపి ప్రయత్నిస్తుందన్నారు. పామర్రు పోలీసుల తీరుపై డిజిపికి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపి నేతలు తెలిపారు.
