‘నిమ్మగడ్డ-మాకు వద్దు’ ఈ మాట అంటోంది ఎవరో కాదు…

Andhra Pradesh government employees expressing reluctance over Nimmagadda Ramesh Kumar

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎం వైఎస్ జగన్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉంది పరిస్థితి. కొంతకాలంగా రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారంలో అధికార ప్రభుత్వం , ఎన్నికల సంఘం భిన్నాభిప్రాయంతో ముందుకు సాగుతున్నాయి. అధికార ప్రభుత్వానికి చేదోడుగా ఉండాల్సిన నిమ్మగడ్డ, చంద్రబాబుతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వం మీద కక్ష సాధింపు వైఖరి వ్యవహరిస్తున్నారు అంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా వీరిద్దరి మధ్యలో ఉద్యోగులు నలిగిపోతున్నారని సమాచారం.

Andhra Pradesh government employees expressing reluctance over Nimmagadda Ramesh Kumar
Andhra Pradesh government employees expressing reluctance over Nimmagadda Ramesh Kumar

ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం హైకోర్ట్ లో ఉంది. ఎక్కువమంది ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికే ఓటు వేస్తున్నారు. దాంతో రాష్ట్ర ఎన్నికల సంఘంలో పని చేయడానికి ఉద్యోగుల విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఉద్యగులను రాష్ట్ర ఎన్నికల సంఘం కు బదిలీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎనికల సంఘం అభ్యర్థన మేరకు మూడు ఏఎస్ఓ, ఒక టీసీఏ పోస్టులకు పేర్లు సిఫారసు చేసింది ఏపీ సర్కార్. మొత్తం 9 మంది ఏఎస్ఓ లు, ముగ్గురు టీసీఏ పేర్లను సాధారణ పరిపాలన శాఖ ఇచ్చింది.

ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా తమ ఆమోదం లేకుండా తమ పేర్లు ఎలా సిఫార్సు చేస్తారు అని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిప్యూటేషన్ ఉత్తర్వులు రద్దు చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘం కోరడం గమనార్హం. సిఎస్ ను కలిసి ఉత్తర్వులు రద్దు చేయాలని ఉద్యోగులు కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేర్లు పంపడాన్ని సిఎస్ దృష్టికి ఉద్యోగులు తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నిమ్మగడ్డ పదవీకాలం ఎప్పుడు పూర్తవుతుందా అని ప్రభుత్వంతో పాటు ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారట.