Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అవత’రణ’ దినోత్సవం.! ఎవరికోసం.?

Andhra Pradesh

Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది చిత్ర విచిత్రమైన పరిస్థితి. నవంబర్ 1వ తేదీ అంటే, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం.! ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. ఆ తర్వాత ఆ ఆంధ్ర రాష్ట్రం, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంతో కలిసి ఆంధప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన రోజు నవంబర్ 1వ తేదీ.

ఇప్పుడేమో, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు. అందులోంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి, ఏ లెక్కన నవంబర్ 1వ తేదీన ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరుపుకుంటున్నట్లు.? ఇదే వింత అంటే.! అత్యంత బాధాకరమైన వింత ఇది.!

కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం గురించి శుభాకాంక్షలు చెప్పేస్తున్నాయ్ అన్ని రాజకీయ పార్టీలూ. ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా వుండేది. ఆ తర్వాత ఆ ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే ఇప్పటి తెలంగాణతో కలిసిందే.. అప్పుడు రాజధాని హైద్రాబాద్ అయ్యింది.

ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయాక, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చంద్రబాబు హయాంలో నిర్ణయించారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక, అసలు రాజధాని ఏదో తెలియని పరిస్థితి. అయినాగానీ, ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని జరిపేసుకుంటోంది ఆంధప్రదేశ్ ప్రజానీకం. ఇది ఇంకో వింత.!

అసలు ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏంటో.? అది ఎవరి కోసమో.. ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇంక పదేళ్ళ తర్వాత అయినా, ఆంధప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుంటుందా.. అప్పటికి ఆంధప్రదేశ్ స్వరూప స్వభావాలెలా వుంటాయ్.? అదైతే ఇప్పుడే చెప్పలేం.!