జెసి దివాకర్ రెడ్డికి పచ్చ కామెర్లు

 

సంచలనాల పుట్ట, అనంతపురం తెలుగు దేశం లోక్ సభ సభ్యుడు  జేసీ దివాకర్ రెడ్డి పచ్చ కామెర్లు అని మండిపడ్డారు అనంతపురం టిడిపి ఎమ్మెల్యే  ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.

జెపి అపుడపుడు తాను బోళా శంకరుడని అనిపించుకునేందుకు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ముఖ్యమంత్రి మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేేస్తుంటారు. అయితే, జెసి మరీ సీనియర్ సభ్యుడుకావడంతో, ముఖ్యమంత్రి చంద్రబాాబు నాయుడు ఆయన వ్యాఖ్యలకు చిరునవ్వు విసిరేసి చూసిచూడనట్లు పోతుంటారు. అయితే,  ప్రభాకర్ చౌదరి అలాకాదు. తేల్చుకునే బాపతు.

 

ఈ రోజు జెసి చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు.  వాళ్లిద్ధరి మధ్య చాలా కాలం బహిరంగంగా వార్ నడుస్తూ ఉంది. ఎమ్మెల్యే తాను చేయాలనుకుంటున్న పనులకు అడ్డుపడుతున్నాడని జెసి గొడవ చేస్తూ వస్తున్నారు. ఆ కోపాన్ని ఆయన చాలా  ముందుకు తీసుకువెళ్లి, అనంతరం పురం తెలుగుదేశం పార్టీ కమ్మ క్యాస్ట్ పీలింగ్ తో రగిలిపోతుూ ఉందని కూడా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే, మునిసిపల్ ఛెయిరపర్సను వ్యతిరేక నిరాహార దీక్ష కూడా చేశారు. తాడిపత్రి రాజకీయాలు అనంతపురానికి తీసుకు వస్తే వూరుకోమనేది ప్రభాకర్ చౌదరి వాదన. అక్కడి పెత్తనం ఇక్కడ చేస్తే కుదరదు అని ఆయన అంటుంటారు.

అయితే, ఈ రోజు మళ్లీ రెచ్చిపోయి, ఎమ్మెల్యేని గిల్లుకున్నారు. ఎమ్మెల్యే కారణంగా తాను అనంతపురంను అభివృద్ధి చేయలేకపోయన్నారు. 

‘పచ్చకామెర్లవాడికి అంతా పచ్చగానే కనిపిస్తుంది, జేసీకి కూడా అంతే,’ ప్రభాకర్ చౌదరి విజయవాడలో అన్నారు. అంతేకాదు, జెసికి చాలా గట్టి గా వార్నింగ్ ఇచ్చారు.

‘నేను నోరు విప్పితే జేసీకి అక్రమాలు చాలా బయటకు వస్తాయి, రోడ్డు వెడల్పు ఎవరి అభివృద్ధి ‌కోసం, ఎవరి బస్సులకోసంమో భవిష్యత్తులో మాట్లాడాల్సి వస్తుంది,’ అని అనేశారు.

జెసి బస్సు ల వ్యాపారం లో చాలా అక్ర మాలు ఉన్నాయని, అవన్నీ తనకు తెలసని ఆయన చెప్పకనే చెప్పారు.

‘కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జేసీ తీరు ఇలానే ఉంది. జేసీ కాంగ్రెస్ పార్టీలో వున్నపుడు నుండి‌ నాపై వ్యక్తిగత కక్ష పెంచుకున్నాడు

నా మీద వ్యక్తిగత కక్షతోనే జేసీ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాంగ్రెసు పాలనలో హత్యలు జరిగేవి, గత నాలుగేళ్లుగా అనంతలో ప్రశాంత పరిపాలన సాగుతుంది,’ అని అన్నారు.

‘పోలీసులు నేరాలను అడ్డుకునేందుకు నిత్యం పని చేస్తుంటే వారి మీద కూడా వ్యాఖ్యలు చేయడం బాధకరం, జేసీ అక్రమాలను నేనే సీఎం దృష్టికి తీసుకెళ్తాను,’ అని ప్రభాకర్ చౌదరి అన్నారు.

ఇంతకీ, జెసి దివాకర్‌ రెడ్డి ఏమన్నారో తెలుసా…

అనంతపురం  ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పట్టణాభివృద్ధికి అడ్డొస్తున్నాడు.  అనంతపురంలో రోడ్ల వెడల్పుకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడు.  ప్రభాకర్‌ చౌదరి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడు. మున్సిపల్ భవనాల అద్దె డబ్బు మేయర్‌తో కలిసి స్వాహా చేస్తున్నాడు.  ఆర్కియాలజీకి అప్పగించిన పీస్‌ మెమోరియల్‌ హాల్‌పై ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పెత్తనం ఏమిటి?

జిల్లాలో దౌర్జన్యాలు, రౌడీయిజం పెరుగుతూ ఉంది.  కార్పోరేషన్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను. ఎవరూ  పట్టించుకోవడంలేదు.ఇక మిగిలింది, అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను.