చంద్రబాబుకు ఐటీ నోటీసులు.. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్.. ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నా మౌనంగా ఉన్న విపక్షాల వ్యవహారశైలి చుట్టూ ఇప్పుడు ఏపీరాజకీయం తిరుగుతుంది! ఆఖరికి కమ్యునిస్టులు సైతం ఈ విషయంపై స్పందించక్పోవడంతో… ఇలాంటి వైఖరివల్లే కదా కమ్యునిస్టు పార్టీల పరిస్థితి ఇలా అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ప్రశ్నించడానికి పార్టీ పెట్టినట్లు చెప్పుకునే పవన్ కల్యాణ్ సైతం ఇంత పెద్ద వ్యవహారంపై స్పందించకపోవడంపైనా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయని తెలుస్తుంది. పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉండే పవన్.. కనీసం ట్విట్టర్ లో అయినా స్పందించొచ్చు కదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయినా కూడా జనసేన నేతలు కానీ, పవన్ కల్యాణ్ కానీ ఈ విషయంపై స్పందించడం లేదు. దీంతో… గతకొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో కనిపించకుండా పోయినట్లు ఉన్న పవన్ ని మంత్రి అంబటి రాంబాబు ఆన్ లైన్ వేదికగా పిలుస్తూ పలకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా పవన్ ని బ్రో అని సంబోధిస్తూ ఒక ట్వీట్ చేశారు.
హలో … ఏమైపోయావ్ “బ్రో”!
బాబు గారు బొక్కలోకి పోతానంటున్నాడు.
వచ్చి… పలకరించి, పులకరించి… పో!
అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా అంబటి స్పందించారు. ఇందులో భాగంగా… చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి ఆయనకు భయమేస్తుందని చెప్పుకొచ్చిన అంబటి… అరెస్ట్ అవుతున్నట్లు ఆయనకు కల వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు.
కాగా పవన్ లేటెస్ట్ సినిమా “బ్రో” లో అంబటి రాంబాబు తరహాలో శ్యాంబాబు పాత్రని క్రియేట్ చేశారంటూ మంత్రి ఫైరయిన సంగతి తెలిసిందే. అక్కడనుంచి సందర్భం వచ్చిన ప్రతీసారీ అంబటి రాంబాబు… పవన్ ని ఆడుకుంటూనే ఉన్నారు. తీవ్రమైన వెటకారం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ ద్వారా పిలిచే ప్రయత్నం చేశారు!