“బ్రో” ఫ్లాప్ అని చెబుతున్న అంబటి… రీజన్ వైరల్!

గత శుక్రవారం పవన్ కల్యాణ్, సాయిధరం తేజ్ నటించిన “బ్రో” సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలైనప్పటినుంచీ ఆ సినిమాలోని శ్యాంబాబు పాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని శ్యాంబాబు పాత్రపైనా, పవన్ కల్యాణ్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని.. దానికి అమ్మవారే కారణం అని కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును… “బ్రో” సినిమా విడుదలై మిక్సుడు టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే! ఈ సినిమా బాగానే ఉందని కొంతమంది అంటుంటే… థియేటర్ లో కూర్చోలేకపోయామని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే… ఈ సినిమాలో శ్యాంబాబు పాత్రను క్రియేట్ చేసి తనను వెటకరించారంటూ అంబటీ ఫైరవుతూనే ఉన్నారు. పవన్ తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నాడని విమర్శించారు.

ఇలా రాజకీయంగా ఎదుర్కోలేక సినిమాల్లో పాత్రలు సృష్టించుకుని ఆనందపడటాన్ని శునకానందం అంటారంటూ అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో కలెక్షన్స్ సైతం పడిపోయాయని.. పవన్ కు మాత్రం ప్యాకెట్లు బాగానే అందుతున్నాయని మరో కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా “బ్రో” సినిమా అట్టార్ ప్లాప్ అయ్యిందని చెబుతూ.. అందుకు బలమైన కారణం ఉందని చెబుతున్నారు అంబటి.

ఈ సందర్భంగా స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. సాదారణంగా సినిమా గురించి తాను మాట్లాడనని.. కానీ ఇవాళ మాట్లాడాల్సి వచ్చిందని మొదలుపెట్టారు. “బ్రో” సినిమాలో శ్యాంబాబు అనే పాత్ర సృష్టించారని, అందరూ ఆ పాత్రగురించే మాట్లాడుతున్నారని అంబటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా… “బ్రో” ఒక ఫ్లాప్ సినిమా అని, సినిమాకు కలెక్షన్లు లేవని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును… బ్రో సినిమా అట్టార్ ప్లా అయ్యిందని అంబటి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాను కాంట్రవర్సీ చేస్తే ఇంకొన్ని డబ్బులు వస్తాయని అన్నారు. సినిమాను సినిమాగా తీయాలని.. అలా తీయకపోవడం వల్లే “బ్రో” ఫ్లాప్ అయిందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆఖరికి పవన్ తీసుకున్న రెమ్యునేషన్ కూడా వసూళ్ కాలేదని అంబటి వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో… పవన్ సినిమాలు ఇక ఆడవని సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి… ఏనాడైతే వారాహి అనే వాహనాన్ని తన కాళ్ళ కింద పెట్టుకుని తిరగడం మొదలుపెట్టాడొ.. ఆ రోజు నుంచే అమ్మవారి శాపం తగిలిందని అన్నారు. ఫలితంగా… పవన్ అటు సినిమాల పరంగానూ ఇటు రాజకీయాల పరంగానూ ఫ్లాప్ అని తాను ఎప్పుడో చెప్పినట్లు అంబటి గుర్తుచేసుకున్నారు.