2024లో వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ చరిత్ర ముగిసినట్లేనా?

2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎన్నికలకు వెళ్లగా ఎన్నికల ఫలితాలు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలకు సైతం భారీ షాకిచ్చాయి. కేవలం 23 సీట్లలో మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా రాయలసీమలో కేవలం మూడంటే మూడు స్థానాలలో టీడీపీ విజయం సాధించడాన్ని బట్టి అప్పట్లో చంద్రబాబు పాలన ఏ విధంగా ఉందో సులువుగా అర్థమవుతుంది. కడప, కర్నూలు జిల్లాలలో టీడీపీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు.

చంద్రబాబు నాయుడు గొప్పగా చెప్పుకునే టీడీపీ ఈ విధంగా జరగడంతో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అయితే 2024లో వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ చరిత్ర ముగిసినట్లేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు లోకేశ్ ను మినహా మరెవరినీ టీడీపీ తరపున సీఎం కావాలని అనుకోరు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు లోకేశ్ ను మాత్రం తమ నాయకుడిగా అంగీకరించే పరిస్థితి అయితే లేదు.

అటు చంద్రబాబు అభిప్రాయాలు ఇటు టీడీపీ నేతల అభిప్రాయాలు భిన్నంగా ఉండటంతో టీడీపీ 2024 ఎన్నికల్లో ఓటమిపాలైతే ఆ పార్టీకి భవిష్యత్తు లేదనే చెప్పాలి. టీడీపీ నారా కుటుంబానికే పరిమితం కావాలని చంద్రబాబు భావిస్తుండటంతో నందమూరి అభిమానులు సైతం టీడీపీ విషయంలో గతంలోలా పాజిటివ్ గా లేరు. కొత్త పార్టీలు ఏర్పడుతూ ఉండటంతో ఆ పార్టీల వల్ల కూడా టీడీపీకే నష్టమని చెప్పవచ్చు.

అయితే చంద్రబాబు టీడీపీ అధికారంలోకి రావడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరనే సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో జగన్ సైతం వైసీపీ అధికారంలో కొనసాగాలనే ఆలోచనతో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ ఏపీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. జగన్, చంద్రబాబు వ్యూహాలలో ఎవరి వ్యూహాలు ఎన్నికల్లో గెలిపిస్తాయో చూడాలి.