మన ఓటు హక్కుకు సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే, ఫిర్యాదు చేయాలనుకుంటే, ఇంకా ఇతరత్రా ఏదైనా సమస్య ఏర్పడితే టక్కున 1950 నంబర్‌కు ఫోన్ చేసేస్తాం. ఈ నంబర్‌కు కాల్‌చేసి మన ఓటు గురించి సమాచారం తెలుసుకోవచ్చు. సమాచారం ఇవ్వడంతోపాటు అభిప్రాయాలు తీసుకోవడం, సలహాలు, ఫిర్యాదుల స్వీకరణ ఈ కేంద్రం సిబ్బంది చేస్తారు.
ఈ నంబర్‌తో ప్రతి జిల్లా కలెక్టరేట్‌లోని కాంటాక్ట్ సెంటర్ ద్వారా సేవలు అందిస్తారు. ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ఈ హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ నంబర్‌ను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేసిందో తెలుసా? భారత ఎన్నిక సంఘం 1950 జనవరి 25న ఏర్పాటైంది. అదే సంవత్సరాన్ని హెల్ప్ లైన్ నంబర్‌కు కేటాయించింది. ఆ విధంగా 1950 నంబర్ హెల్ప్ లైన్ గా మారింది.