జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ వెయ్యి కోట్ల ప్యాకేజీని ఇచ్చేలా మంతనాలు జరుపుతున్నారని టీడీపీ అనుకూల మీడియా నుంచి కథనాలు వండి వడ్డించబడ్డాయి. చంద్రబాబు అనుమతి లేకుండా ఏబీఎన్ రాధాకృష్ణ నుంచి ఇలాంటి రాత వచ్చే అవకాశమే లేదు.
టీడీపీ అధినేతకు జనసేన మీద అనుమానమొచ్చింది. దాంతోనే, జనసేన ఇమేజ్ దెబ్బ తీయడానికి, కేసీయార్ పేరుతో ఏబీఎన్ రాధాకృష్న ద్వారా వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రచారాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారు.
మొదటి నుంచీ అంతా అనుకుంటున్నదే.. జనసేనకు వైసీతో కాదు ముప్పు.. చంద్రబాబుతోనే పెను ముప్పు అని. అసలు ప్యాకేజీ ప్రచారానికి ఆద్యుడే చంద్రబాబు. అదే చంద్రబాబుతో జనసేన అధినేత అంటకాగుతూ వచ్చారు ఇప్పటిదాకా. ఇప్పుడిక పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు.? పవన్ కళ్యాణ్ ఏం చేస్తారన్నది వేరే చర్చ. తెలుగుదేశం పార్టీ అయితే ఈ దెబ్బకి పూర్తిగా ఔట్ అయిపోతుందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.
వెయ్యి కోట్ల ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ తలొగ్గేవాడే అయితే, జనసేన పార్టీని నేరుగా వైసీపీనే తమవైపుకు తిప్పకుంటుంది. కేసీయార్ ఎందుకు వైసీపీ కోసం వెయ్యి కోట్లు పవన్ కళ్యాణ్ మీద ఖర్చు చేస్తారు.?
ప్రజారాజ్యం పార్టీ మీద కూడా ఇలాంటి దుష్ప్రచారమే చేయించారు చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా. ఇప్పుడు అంతకు మించిన విష ప్రచారం జనసేన మీద టీడీపీనే చేయిస్తోంది. వైసీపీని చెప్పుతో కొడతానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రచారంపై ఏబీఎన్ రాధాకృష్ణని చెప్పుతో కొడతానని అనగలరా.?