తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా చక్రం తిప్పిన వారంతా ఇప్పుడు కనుమరుగు అయిపోయారు. అసలు మ్యాటర్ ఏంటంటే టీడీపీ నేతలు అరెస్టులకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళణలకు పిలుపునిచ్చారు అధినేత చంద్రబాబు. అయితే నాడు చంద్రబాబు సర్కార్ హాయం కీలకంగా వ్యవహరించిన వారంతా ఇప్పుడు పూర్తిగా సైలెంట్‌గా ఉండడంతో టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి.
టీడీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా చక్రం తిప్పిన గంటాశ్రీనివాసరావు, సీఆర్ డీఏ సహాపట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా చక్రం తిప్పిన పొంగూరు నారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు వంటి వారు, గతంలో బాబు సర్కార్ ఉన్నప్పుడు కీలకంగా వ్యవహారించారు. టీడీపీ ప్రభుత్వం జమానాలో చక్రం తిప్పిన ఆయా నేతలు ఇప్పుడు, ఒక్కమాట కూడా మాట్లాడంలేదు.. చంద్రబాబు పిలుపు ఇచ్చినా కనీసం నిరసనల్లోనూ పాల్గొనపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అయితే వీరంతా సైలెంట్ అవడం వెనుక అసలు కారణం ఏంటంటే.. ఈ ముగ్గురి పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు.. పాఠశాలలకు సంబంధించి రంగుల విషయంలో జరిగిన అవకతవకల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పై వైసీపీ ప్రభుత్వం ఆరా తీస్తోంది. దీంతో ఈ కేసులు బయటపడిడే గంటా శ్రీనివాసరావు ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉందని సమాచారం.
ఇక మరోవైపు మాజీ మంత్రి పొంగూరు నారాయణకు, సీఆర్ డీఏ భూములు, అమరావతి భూముల విషయంలో, ఆయన పాత్ర ఉందని, మొదటి నుండి వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే అవరావతి భూములు వ్యవహారం వైసీపీ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయిన పొంగూరు నారాయణ, ఏరోజు ఏంజరుగుతుందో అని భయంతో పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
అలాగే టీడీపీలో మరో కీలకమైన నాయకుడుగా చక్రం తిప్పిన ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఇటీవల పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు ఆయన సతీమణి వెంకాయమ్మ చేతివాటం బాగానే ప్రదర్శించారని ఆరోపణలు ఉన్నాయి. నాడు నకిలీ పురుగు మందుల దుకాణాలను ప్రోత్సహించి భారీగానే దోచేశారని అక్కడి నియోజకవర్గంలో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వీటిపై కూడా వైసీపీ ప్రభుత్వం విచారణ జరిపించే అవకాశం ఉండడంతో, ప్రత్తిపాటి పుల్లారావు కూడా సైలెంట్ అయిపోయారు. టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలు వైసీపీ సర్కార్ ఆషామాషీగా తీసుకోకపోవడంతో టీడీపీ ముఖ్యనేతలంగా సైలెంట్‌గా ఉంటున్నారని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటన్నారు.