నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి అరెస్టయ్యారు. ఎంపిడివో సరళకు ఎంఎల్ఏ కోటంరెడ్డికి మధ్య వివాదం సంగతి అందరికీ తెలిసిందే. తనపై కోటంరెడ్డి ధౌర్జన్యం చేసినట్లు సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వివాదం వెలుగులోకి రావటంతో పెద్ద గలాబా మొదలైంది.
ఇద్దరిలోను తప్పెవరిదో స్పష్టంగా తెలియకపోయినా వివాదం మాత్రం పెద్దదైంది. మామూలుగా అయితే అధికారపార్టీ నేతలు, ఎంఎల్ఏలపైన ఆరోపణలొస్తే పోలీసులు చూసీ చూడనట్లుంటానరన్న విషయం అందరకీ తెలిసిందే. చంద్రబాబునాయుడు హయాంలో ఏం జరిగిందో అందరూ చూసిందే.
టిడిపి మాజీ ఎంఎల్ఏలు చింతమనేని ప్రభాకర్, యరపతినేని ప్రభాకర్, బోండా ఉమామహేశ్వరరావు, కేశినేని నాని లాంటి వాళ్ళు అధికారులపై చేసిన ధౌర్జన్యాలు అందరికీ తెలిసిందే. టిడిపి నేతలు ఎన్ని ధౌర్జన్యాలు చేసినా ఒక్కళ్ళపైన కూడా చంద్రబాబు ఈగ వాలనీయలేదు. తమ నేతలపై పోలీసులు ఎటువంటి కేసులు పెట్టకుండా చంద్రబాబు అడ్డుకునే వారు.
మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. పోలీసులకు జగన్ స్వేచ్చ ఇవ్వటంతో వాళ్ళు కూడా దూకుడమీదున్నారు. అందుకనే కోటంరెడ్డిపై పోలీసులు రెండుసార్లు కేసులు నమోదు చేశారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే జర్నలిస్టుపై జరిగిన గొడవలో ఎంఎల్ఏపై కేసు పెట్టారు. తాజాగా ఎంపిడివో ఇచ్చిన ఫిర్యాదుతో ఎంఎల్ఏను అరెస్టు కూడా చేశారు.