జబర్దస్త్ వేదికపై హైపర్ ఆది ని అరెస్ట్ చేసిన పోలీసులు..

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. షో జరుగుతుండగానే పోలీసులు వచ్చి అతన్ని అరెస్టు చేసారు. అతడు ఉదయం షో కు వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని కారుతో గుద్ది పట్టించుకోకుండా వచ్చారని, ఆ అమ్మాయి ప్రస్తుతం సీరియస్ గా ఉందని అన్నారు.

అయితే ఇదంతా నిజం కాదని.. కేవలం రేటింగ్ కోసం ఇలా చేశారు అని తెలియటంతో షో పై దారుణంగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. రేటింగ్ కోసం ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ప్రేక్షకులను ఆటపట్టించవద్దు అని విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి ప్రాంక్ లు ఈ షో మానుకోవాలి అని లేదంటే ఈ షో లేకుండా చేస్తామని అంటున్నారు.