వైఎస్ కుటుంబం అరుదైన రికార్డు నమోదు చేసింది. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన అరుదైన రికార్డు వైఎస్ కుటుంబం సొంతం చేసుకుంది. సోమవారం మొదలైన బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా బ్రహ్మోత్సవాలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన విషయం అందరికీ తెలిసిందే. వైఎస్సార్ సిఎంగా ఉన్న ఐదేళ్ళు బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి క్రమం తప్పకుండా పట్టువస్త్రాలు సమర్పించారు.
ముఖ్యమంత్రులుగా పనిచేసిన తండ్రి, కొడుకులు వైఎస్సార్, జగన్ మాత్రమే కావటంతో వాళ్ళే అరుదైన రికార్డు సృష్టించినట్లైంది. సమైక్య ఏపిలోనే కాదు ప్రస్తుత ఏపిలో కూడా ముఖ్యమంత్రులైన తండ్రి, కొడుకులు లేరనే చెప్పాలి. దాంతో అరుదైన రికార్డు వైఎస్ కుటుంబం సొంతమైంది.