రివర్స్ టెండర్లపై కేంద్రం ఏమంటుంది ?

రివర్స్ టెండర్ల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పింది. రివర్స్ టెండర్ల ప్రక్రియ వల్ల టైం వేస్టు తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదని తేల్చేసింది.  తన ఆలోచనల ప్రకారం ముందుకెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తే తీవ్రంగా ఆక్షేపించింది. సరే మొత్తానికి ఎంతమంది అభ్యంతరం చెప్పినా జగన్ ముందుకే వెళ్ళారు.

సీన్ కట్ చేస్తే పోలవరం ప్రాజెక్టులోని  రెండు పనులకు రివర్స్ టెండర్లు పిలిస్తే సుమారు రూ. 730 కోట్లు మిగిలింది.  పోలవరంలో హెడ్ వర్క్స్ తో పాటు హైడల్ ప్రాజెక్టు పనిలోనే సుమారు రూ. 682 కోట్లు మిగిలింది. ఇక రెండు రోజుల క్రితం65వ ప్యాకేజీకి జరిపిన రివర్స్ టెండర్లలో మరో రూ. 58 కోట్లు మిగిలింది. అంటే రెండు పనులలోనే భారీగా ప్రజాధానం ఆదా అయ్యిందని తేలిపోయింది.

జరిగిన రెండు పనుల్లోనే రూ. 730 కోట్లు మిగిలితే ఇంకా రివర్స్ టెండర్లు పిలవాల్సిన చాలా పనుల్లో ఇంకెత మిగులుతుందన్న విషయంపై ఇపుడు చర్చ జరుగుతోంది. అంటే ఇపుడు ప్రభుత్వానికి మిగులుతున్న డబ్బంతా చంద్రబాబునాయుడు పాల్పడిన అవినీతి క్రిందే లెక్క.

తన బినామీలుగా ప్రచారంలో ఉన్న సిఎం రమేష్ కు రాయలసీమలోని హంద్రీ-నీవా, గాలేరు-నగిరి, తెలుగుగంగ ప్రాజెక్టులన్నింటినీ కట్టబెట్టేశారు. ప్రతి పనిని అంచనా వ్యయాలను పెంచేయటం పనులు సక్రమంగా చేయకుండానే బిల్లులు దోచేసుకోవటంతోనే సరిపోయింది. ఇటువంటి కాంట్రాక్టు సంస్ధలన్నింటికీ జగన్ నిర్ణయంతో టెన్షన్ మొదలవ్వటం ఖాయం. మరి కంటి ముందే రివర్స్ టెండర్లతో ఇంతేసి ప్రజాధనం ఆదా అవుతుంటే కేంద్రం ఏమంటుందో చూడాలి.