మున్సిపల్ ఎన్నికల హడివిడి మొదలయిన విషయం తెలిసిందే. నాయకుల ప్రచారాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ నెల 22న జరగబోయే ఎన్నికల్లో 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
అయితే ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది అభ్యర్థులు ఓటర్లను ప్రసారం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఇక భువనగిరి మునిసిపాలిటీకి చెందిన ఓ అధికార పార్టీకి చెందిన ఓ వార్డు అభ్యర్తికి మహిళా సంఘాలు షాక్ ఇచ్చాయి. షాక్ ఏమిటంటే… మా దగ్గర 600 ఓట్లు ఉన్నాయని 15 లక్షలు డబ్బును ఇస్తే మా ఓట్లన్నీ మీకే వేస్తామని అడిగారు. ఇదే బంపర్ ఆఫర్ ప్రత్యర్ధి పార్టీ అభ్యర్తికి కూడా ఇవ్వడంతో ఆయా అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు. అంటే నాయకులే కాదు ఇక్కడ జనం కూడా కొంత మంది తెలివిగా ప్రవర్తిస్తున్నారు.
ఈ విధంగా ఓట్లను అమ్ముకోవడం అనేది నేరమని తెలిసినా కూడా ఇలాంటి పనులకు కొందరు డబ్బుకు ఆశపడి ఒప్పుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితులకు నాయకులు ఎలాంటి స్పందనలు ఇస్తున్నారు ఏంటన్నది తెలియాలి. మొదినుంచి కూడా డబ్బులు ఇచ్చా ఓటు వేయించుకోవడం అనేది మన నాయకులకు బాగా అలవాటు అయిపోయింది. అలాగే జనాలు కూడా చాలా వరకు దానికి అలవాటు పడ్డారు. వాళ్ళ ఓటు హక్కును అమ్ముకోవడం అనేది నేరమని తెలిసినా అప్పటికప్పుడు వచ్చే డబ్బుల కోసం ఆశపడి ఇలాంటి పనులు చేస్తున్నారు.