టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పాలనలో ప్రజల కన్నా మీడియానే నమ్ముకొని నట్టేట మునిగినట్లు తెలుస్తుంది. బాబు అనుకూల మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడులపైనే ఆధారపడి పాలన సాగించారని పలు ఆరోపణలు వస్తున్నాయి. బాబు పాలన ప్రజల కోసం జనాకర్షణ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ ప్రజల్లోకి వెళ్లుతున్నాయా లేదా అనే విషయంపై బాబు దృష్టి కేటాయించలేదు. పైగా అనుకూల మీడియా సలహాలు, సూచనల మేరకే పాలన సాగించారని విమర్శలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన పాలన కంటే మొన్నటి దాక సాగిన పాలన భిన్నంగా ఉంది. తన సామాజిక వర్గానికే పెద్ద పీఠ వేశారని విమర్శలు కూడా చాలా వచ్చాయి. వాస్తవానికి ఎవరూ సీఎం పదవిలో ఉంటే వారి సామాజిక వర్గానికి కొంత మేలు చేసే ప్రయత్నాలు చేయడం సహజమే. కానీ గత ఐదేళ్ల ల్లో బాబు సామాజిక వర్గం ఊళ్లనే కబ్జా చేసే విధంగా చెలామణి చేయించారు. దీన్ని కంట్రోల్ చేయడంలో బాబు విఫలమయ్యారని తెలిసింది. పింఛన్లు, పసుపు కుంకుమ వంటి కార్యక్రమాలకు భారీ ఎత్తున నిధులను కేటాయించినప్పటికీ వాటి వల్ల ఓట్లు రాలేదు. దీర్ఘ కాలిక ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం ఓట్ల కోసమే పథకాలను పెట్టారు. ఈ లోసుగులే వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చుకున్నారు. పైగా ఓదార్పు యాత్ర నిరంతరం కొనసాగడంలో ప్రజల్లో సానుభూతి పెరిగింది. దీంతో ప్రజలు జగన్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు తోహదపడిందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా జగన్ అధికారంలోకి రాగానే కొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. బాబు వస్తే ఉపాధి వస్తుందని భావించిన యువత ఐదేళ్లల్లో ఉపాధి లేక అసంతృప్తిలో ఉన్నారు. దీంతో జగన్ రాగానే గ్రామ వలేంటీర్స్ పోస్టులను భర్తీ చేశారు. ఈ పోస్టుల భర్తీ వల్ల యువతలో కొంత ఉత్సాహన్ని జగన్ నింపగల్గారు. ఇప్పటికీ జగన్ పై బాబు అనుకూల మీడియా వ్యతిరేకంగా రాస్తున్నప్పటికీ ప్రజలు మెచ్చే పాలన అందించడంలో జగన్ తనదైన ముద్ర వేసుకున్నారని తెలుస్తుంది.