చదవింది ఆర్థిక శాస్త్రమే అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రవిజ్ఞానం అపారం.
కడప ఉక్కు సాధన కోసం టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ నాయుడు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దాదాపు పదిరోజులు దీక్షలో ఉన్నారు. అపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు సమస్య ఏంటంటే, అక్కడ చంద్రబాబు నాయుడు జాతి నుద్దేశించి చేసిన ప్రసంగం. ఈ ప్రసంగం తెలుగు వాళ్లంతా తలదించుకునే లా ఉంటుంది. ప్రసంగం పాఠంలో వచ్చి న అచ్చు తప్పని సర్దు కుపోలేనంత అవమానకరంగా ఆయన ప్రసంగించారు. తన హోదాను దిగజార్చకున్నారు. ఈ ప్రసంగంలో ఆయన చేసిన తప్పు రాష్ట్రంలో ఏ స్కూలు కుర్రవాడు కూడా చేయడు. గతంలో స్కూళ్లలో చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చేసిన సలహా ఇక్కడు గుర్తుకొస్తుంది. కొత్తగా సాఫ్ట్ వేర్ వేవ్ వస్తున్నరోజుల్లో ఆయన హిస్టరీ ని బ్యాన్ చేయాలన్నారు. చాలా మంది తీవ్రంగా విమర్శించాక చెంపలేసుకున్నారు. ఆయన కు చరిత్ర అంటే గిట్టదని ఈ కింది వీడియో చూస్తే అర్థమవుతంది.రమేష్ కడప ఉక్కు కోసం నిరాహార దీక్ష కు కూర్చుని ఉండవచ్చు. ఆయన చాలా ధనవంతుడు, రాజకీయ బలవంతుడు అయ్యుండవచ్చు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా సన్నిహితుడయి వుండవచ్చు. అంత మాత్రాన ఆయన చేసిన నిరాహార దీక్షను పొట్టి శ్రీరాములు 1951 అక్టోబర్ మద్రాసులో చేపట్టిన దీక్షతోె పోల్చడం తగునా.పొట్టి శ్రీ రాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం మద్రాసు లో 1952 అక్టోబర్ 19 న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించి చివరికి 1952 డిసెంబర్ 15 న ఆంద్ర రాష్ట్ర ఆశయ సాధన కొసమే నిరాహార దీక్ష చేస్తూనే ప్రాణ త్యాగం చేసారు కాని ఆయన ఎక్కడా మీరు సభలో ఈరోజు చెప్పినట్టు దీక్ష విరమించలేదు. పొట్టి శ్రీరాములు ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష కుపూనున్నారు. ఎన్ని రోజులుచేశారు. చివరకు ఏమయింది. ఆయన దీక్ష ఆంధ్ర రాష్ట్రం కోసం చేశారా, ఆంధ్రప్రదేశ్ కోసం చేశారా? ఈ విషయాలు ఆయన దీక్ష ఫలాలను అనుభవిస్తున్న ముఖ్యమంత్రికి తెలియాాల్సిన అవసరం లేదా? ఆయన ప్రసంగంలో ఏమి చెప్పారంటే…
పోట్టిశ్రీరాములు సిఎం రమేశ్ లాగా నిరాహార దీక్ష చేసి ‘కడాన ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రం హామీ వచ్చాక దీక్ష విరమించారు.
సిఎం రమేష్ దీక్ష ఏమిటి? పొట్టి శ్రీరాములు దీక్ష ఏమిటి, శ్రీరాములు దీక్ష ఎందుకు చేశాడు, ఆంధ్రకు, ఆంధ్ర ప్రదేశ్ తేడా ఏమిటి; అసలు పొట్టి శ్రీరాములు దీక్ష విరమించాడా, మరయితే అమర జీవి అని ఎందుకంటున్నారు… అంతా అయోమయం… వీడియో చూడండి.