ఇల్లు కట్టు కోవడము, పెళ్ళి చేయడము అనేవి చాల ఖర్చుతో కూడుకున్నవి. వీటిలో ఏపని చేసినా చాల కాలం వరకు ఆర్థికంగా కోలుకోలేరనే విషయాన్ని చెప్పడానికి ఈ సామెతను వాడారు మన పెద్దలు. అందుకే పేద ప్రజలకు ఇళ్లు అనేది జీవిత కాలం కోరికగానే మిగిలిపోతుంది. అయితే వారి కోరికను జగన్ తీర్చబోతున్నాడు. పేదలకు ఇళ్ల నిర్మాణం పై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఈ రోజు సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుతో సహా అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల ఇళ్ల నిర్మాణం పై సమీక్షించిన జగన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని సీఎం ఆదేశించారు. కాగా నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అన్ని సదుపాయాలను ఉండనున్నాయి. బెడ్ రూం, కిచెన్, లివింగ్ రూం, టాయిలెట్, వరండా సహా సదుపాయాలు ఉండేలా జగన్ ఆదేశాలు జారీచేశారు. జగన్ ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే పేదలకు గొప్ప మేలు చేసినట్టే.
మరి అధికారులు కూడా అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో పనిచేయాలి. గవర్నమెంటు అంటే నాసిరకం అనే పేరుపోయి.. గవర్నమెంటు చేస్తే నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలి. పేదలకోసం జగన్ చేస్తున్న ఈ కార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేసేలా ప్రభుత్వ సలహాదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ఒక్కటి మాత్రం నిజం చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలు చేపడుతున్నాడు జగన్. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే జగన్ ఆశ ఆశయం నేరవేరుతుందని ఆశిద్దాం .