ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ మంత్రి తాజాగా చేసిన కామెంట్ల వల్ల ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే జగన్ అనుమతి లేకుండా ఇలాంటి కామెంట్లు చేయడానికి మంత్రులు సాహసించరనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వల్ల ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీనే విజయం సాధించే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకుంటే మాత్రం రిజల్ట్ చెప్పలేమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీ ఓటమి ఖాయమని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ కు సైతం ఇతర పార్టీల పొత్తుల వల్ల వైసీపీకి భారీ స్థాయిలో నష్టమనే సంగతి తెలుసు. పీకే టీం సైతం జగన్ కు ముందస్తు ఎన్నికలే బెస్ట్ అని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. 2023 మధ్యలో ఎన్నికలు జరగవచ్చని సమాచారం అందుతోంది. జగన్ ముందస్తు దిశగా అడుగులు వేస్తే మాత్రం ఇతర పార్టీలు సైతం షాకవుతాయి.
అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల భారీస్థాయిలో ఖర్చులు పెరుగుతాయి. ఈ విషయాలను కూడా గుర్తుంచుకుని వైసీపీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సీఎం జగన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.