నార్త్ ఇండియన్ల మీద పవన్ కన్ను, ఎందుకో తెలుసా?

జాతీయ వాదమే జనసేన సిద్దాంతం…..ఉత్తర భారతీయులకు జనసేన అండ…..!

విశాఖపట్నం పాండురంగాపురం వైట్ హౌజ్ లో వైజాగ్ లో స్థిరపడ్డ ,నివసిస్తున్న నార్త్ ఇండియన్ సమావేశంలో పాల్గోన్న జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ ఉత్తర భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతు అన్ని ప్రాంతాలు,జాతులు,మతాలు,కులాల మధ్య కలయిక సముహమే భారతదేశం అన్నారు.మన దేశానికి వ్యాపారం నిమిత్తం వలస వచ్చిన యురోపియన్లు మన సంస్కృతి, సాంప్రదాయలను తమకు అనుగుణంగా మార్చే ప్రయత్నించారు, కానీ నేడు మన సంస్కృతి కి స్వాగతం పలుకుతున్నారు యురోపియన్లు.

pawankalyan meet with north indians

భారత మాతకు గుడి కట్టిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఉత్తరాంధ్ర అని తెలిపారు.సంస్కృతులను, సాంప్రదాయాలను, ప్రాంతీయతలను విస్మరించని జాతీయ వాదం ఉండాలని అది తమ పార్టీ సిద్ధాంతాల్లో పెట్టామని గుర్తుచేశారు జనసేనాని పవన్ కళ్యాణ్.

2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని మద్దతు ఇస్తే ఇప్పుడు విశాఖ లో భూ కబ్జాలు, కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నారు. పాలిటిక్స్ అంటే కోట్లు కూడపెట్టడం , రౌడీయిజం, రిగ్గింగ్ లు అన్న స్థాయి కి దిగజారున్నారని దుయ్యబట్టారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.

pawankalyan

తన విద్యార్థి దశ ను నెమరు వేసిన పవన్ కళ్యాణ్….!

నేను 10 తరగతి చదువుతున్న సమయంలో ఒక యోగి ఆత్మకథ పుస్తకం నాపై చాలా ప్రభావం చూపింది అన్నారు.అన్ని వదులుకుని శాంతి మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నా, ఆ సమయంలో చిరంజీవి గారు చెప్పిన మాటలు మళ్ళీ నాలో ఆలోచనలు రేకెత్తించాయి. ఏదైనా సాధించాలంటే సంపాదించాక దానిని వదులు కోవడానికి సిద్దమైనప్పుడు ఆ మాట చెప్ప అని అన్నరు.అందుకే సినిమాల్లో సంపాదించి, రాజకీయ పార్టీ పెట్టి మళ్లీ ప్రజలకే ఖర్చు చేస్తున్నానని చెప్పారు పవన్ కళ్యాణ్.

విశాఖపట్నం లో ఉత్తర భారతీయుల సమావేశంలో పాల్గొన్న పవన్ వైజాగ్ ప్లై వుడ్ అసోసియేషన్, రాజస్థాన్ సంస్కృతి మండల్, రాజస్థానీ మహిళా సమితి, అగర్వాల్ మహాసభ సమాజ్ తదితర సంఘాల సభ్యులతో వారి సమస్యల పై చర్చించారు.రాజకీయాల్లో జవాబు దారితనం తీసుకురావడమే జనసేన ధ్యేయం అని, డబ్బు కోసం, పార్టీ ఫండ్ పేరు తో పీడించే పార్టీ తమది కాదని తెలిపారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్.

చివరగా మీరు ఎన్నికల్లో ఏ పార్టీకైనా సపోర్ట్ చెయ్యండి కానీ ప్రజా సమస్యలపై పోరాటం లో మాత్రం జనసేన పార్టీ కి ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ కోరడంతో జనసేన పార్టీ ఉద్యమాలకే పరిమితం అవ్వనుందా అని చర్చలు మొదలయ్యాయి….!

pawankalyan

ఇదీ అసలు కథ…….!

పవన్ ఉత్తరాది వారి మీద కన్నేసేందుకు బలమయిన రాజకీయ కారణం ఉంది. పవన్ కల్యాణ్ తీరు గమనిస్తే, ఆయన జాతీయ జండా, భారత్ మాతకు జై తో పాటు ఇతర చేష్టలన్నీ బిజెపి హిందూ జాతీయ వాదానికి దగ్గరగా ఉంటాయి. బిజెపి తప్ప భారతదేశంలో ఇంతగా అతిగా జాతీయ జండాను, జాతీయ గీతాన్ని వాడిన పార్టీ లేదే. ఉత్తరాది నుంచి వ్యాపారస్థులు చాలా మటుకు బిజెపికి అనుకూలురే. వినాయకు చవితి పండగలను, హన్మాన్ జయంతిని ఘనంగా జరిపే పద్ధతి ప్రవేశపెట్టింది కూడా వారే. నిజానికి తెలుగు రాష్ట్రాల్లోని ఏపార్టీకూడా ఉత్తరాదినుంచి వలస వచ్చిన వారిమీద శ్రద్ధ చూపలేదు. వ్యాపారాలు పెరగడం, ఉద్యోగాలు పెరగడంతోో వింధ్య పర్వతాలకవతలవైపు నుంచి హిందూజాతీయ భావజాలం ఉన్నవారు పెద్ద ఎత్తున వలస వస్తున్నారు. వీరిని మచ్చికచేసుకోవడం ప్రస్తుతానికి చిన్న పార్టీగా ఉన్న పవన్ కు చాలా అవసరం. అందుకే ఇంతవరకు ఎవరూ పబ్లీక్ గా చేయని పని చేస్తూ ‘ఉత్తరాది వారితో సమాలోచనలు’ జరిపారు పవన్. పవన్ సాఫ్ట్ జాతీయ వాదం బిజెపికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల మార్వాడీ బలమయిన మార్వాడీ సమాజంతో పాటు ఇతర ఉత్తరాది వర్గాలను ఆకట్టుకోవడం అంతకష్టమేమీ కాదు.పవన్ ఎత్తుగడ పనిచేస్తుందో లేదో చూడాలి.