టిటిడి మీద డా.సుబ్రమణియన్ స్వామి పిటిషన్ రెడీ

గత నాలుగేండ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఆయన ప్రభుత్వం మీద ఏదో ఒక విచారణ చేయించేందుకు పలువురు సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు ప్రయత్నించారు. అవి ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఇందులో ఏది విజయవంతమవుతుందోనన్నభయం కూడా చంద్రబాబునాయుడిలో బాగా బలంగా ఉంది. అందునా ఆయన ఎన్డీయే నుంచి వైదొలిగాక ప్రధాని మోదీ ఏ కేసు కెలుకుతాడో అనే వర్రీతో ఆ మధ్య ప్రతి రోజూ, ప్రతి సమావేశంలో ‘ ‘కేంద్రం కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. నేను కేసులకు భయపడను. నాకేదయినా జరిగిన మీరంతా నాచట్టూ (భరత్ అనే నేను సినిమాలో గ్రామస్థులు మహేశ్ బాబు ను చట్టూర చేరి కాపాడినట్లు) మీరు వలయంగా ఏర్పడి రక్షించుకోవాలి,’ అని అంటూ వచ్చారు.

ఇలా చంద్ర బాబు మీద వస్తున్న ఆరోపణల మీద దర్యాప్తు చేయించాలని, అందునా సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని, వచ్చే ఎన్నికల నాటికి దీనిని పూర్తి చేయాలని ఆళ్ల రామకృష్ణా రెడ్డి లాంటి (వైసిపి ఎమ్మెల్యే)వారు కేసులు వేస్తూ వస్తున్నారు. ఈ జాబితాలో కి ఇపుడు మాజీ కేంద్ర మంత్రి బిజెపి ఎంపి, మేధావి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి వచ్చి చేరారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాల మీద వస్తున్న ఆరోపణల (వజ్రాల దొంగతనం. పింక్ వజ్రం, వజ్రాలు పగిలిపోవడం, శ్రీవారి పోటులో తవ్వకం, టిటిడిలో నియమాకాలు… ఇలా అన్నింటి మీద)మీద కేసువేయబోతున్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ రెడీ అయింది. వచ్చే వారమే కేసు ఫైల్ చేయబోతున్నానని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు.

https://platform.twitter.com/widgets.js

స్వామి కన్నుబడితే, అవతలి వ్యక్తి కంటకునుకు కరువవుతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా ఆయన వదల్లేదు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల విషయంల్ వాళ్ల మీద కేసులు వేసి టెన్ జనపథ్ లోనే కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ క్రియేట్ చేశాడు. ఆయన కేసులవల్ల చాలా మందిని జైలు కు పంపారు. ఇలాంటి సుబ్రహ్మణ్య స్వామి ఇపుడు టిటిడి ద్వారా చంద్రబాబు మీద గురిపెడుతున్నారనిపిస్తున్నది. సుబ్రమణియన్ పట్టుకుంటే వదలడు. పట్టుబడ్డవాడు విదుల్చుకోలేడు. స్వామి పిటిషన్ లో ఏమి కోరతాడో తెలియడం లేదు. ముందు దర్యాప్తు చేయించడని కోర్టును కోరితే.. చంద్రబాబు కు ఇబ్బందే. టిటిడి వ్యవహారం ఇప్పటికే కోర్టు కెక్కింది.హైకోర్టులో ఒక ఆంధ్రా వ్యక్తి, మరొక గుజరాత్ వ్యక్తి కలసి వేసిన పిటిషన్ నిన్ననే విచారణ కు వచ్చింది. పిటిషన్ మీద స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, టిటిడికి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి స్పందిస్తూ సిటింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు తాము సిద్ధమని అపుడు శ్రీవారి ఆభరణాల మాయం అపోహలన్నీ తొలగిపోతయాని ప్రభుత్వం తెలిపింది. దీనికి సుబ్రమణియన్ స్వామి వ్యాజ్యం తోడవుతుంది.