ఏమైందో ఏమో గానీ.. జగన్‌పై నిప్పులు చెరిగే జేసి దివాకర్ రెడ్డి ఇప్పుడు జగన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. జగన్ 9 నెలల పాలన భేష్ అన్నాడు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడే విదంగా ఉన్నాయని, చాలా బాగుంటున్నాయని కూడా పొగిడేశాడు. మరి ఉన్నట్లుండి ఈ పొగడ్తలు ఎందుకు? స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరపడటమే ఇందుకు కారణమా?
పంచాయితీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు 99 శాతం వరకు ఏకగ్రీవం కాబోతున్నాయని జోష్యం చెప్పారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తాను నిలబడటం లేదని జేసీ స్పష్టం చేశారు. దానికి కారణం ఏంటి అన్నది చెప్పలేదు గానీ తాను మాత్రం పోటీ చేయడం లేదని మాత్రం అన్నారు. అయితే ఇది టీడీపీ ఆదేశమా, లేక ఈ ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతాం కాబట్టి నిలబడటం ఎందుకు అని ఆయనే అనుకున్నారో తెలియడం లేదు.
పైగా ఎన్నికల తరువాత అయినా మద్యం, డబ్బు వంటివి పంచినట్టు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని, మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని జగన్ చెప్పడం వల్లే జేసీ ఇక ప్రయత్నాలు చేయడం కూడా వేస్టు కదా అని ఇండైరెక్ట్‌గా చెప్పేశారు. మొత్తంగా ఎప్పుడూ విమర్శిస్తూ.. అప్పుడప్పుడూ జగన్ ను మా వాడే అని అనడం, ఇప్పుడు మంచి పనులు చేస్తున్నాడని పొగడటం వెనుక జేసీ అంతరార్థం ఏమిటో ఆయనే చెప్పాలి.