చంద్రబాబు, చినబాబు అరెస్టు

చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపిచ్చిన  చంద్రబాబునాయుడు, చినబాబులను పోలీసులు హౌస్ అరెస్టయ్యారు.  గుంటూరు జిల్లా ఆత్మకూరు విలేజిలో టిడిపి కార్యకర్తలపై  వైసిపి నేతలు దాడులు చేస్తున్నారంటూ చంద్రబాబు గోల మొదలుపెట్టారు.   గ్రామాల్లో నుండి తరిమేసి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారంటూ గగ్గోలు పెడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. వైసిపి బధితుల కోసం గుంటూరులో శిబిరం పెట్టి నానా హడావుడి చేస్తున్నారు.

ప్రభుత్వానికి నిరసనగా బుధవారం చలో ఆత్మకూరు కార్యక్రమం పెట్టుకున్నారు. దాంతో మంగళవారం నుండే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి నేతలను చంద్రబాబు గుంటూరుకు పిలిపించారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్లు ఇటు శిబిరానికి అటు ఆత్మకూరు గ్రామానికి పంపారు. దాంతో మొత్తం టెన్షన్ మొదలైంది.

ఎప్పుడైతే చిన్న విషయాన్ని కూడా చంద్రబాబు పెద్దదిగా చూపించటం మొదలుపెట్టారో అప్పుడు పోలీసులు మేలుకున్నారు. అప్పటి నుండి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. ఇందులో భాగంగానే చంద్రబాబు, నారా లోకేష్ ను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు, చినబాబుతో పాటు నేతల హౌస్ అరెస్టులయ్యారో  వెంటనే గుంటూరు జిల్లాలో టెన్షన్ తారస్ధాయికి చేరుకుంది.

ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబు, టిడిపి నేతలు పోలీసులతో ఎక్కడికక్కడ వాగ్వాదాలకు దిగుతున్నారు. కావాలనే పరిస్ధితులను ఉద్రిక్తంగా మారుస్తున్నారు. దానికి మద్దతుగా ఎల్లోమీడియా ఆజ్యం పోస్తుండటంతో మెజారిటి మీడియాలో  చంద్రబాబు వాదనే బాగా హైలైట్ అవుతోంది. మొత్తానికి ఈ పరిస్ధితి ఎక్కడికి దారి తీస్తుందో చూడాల్సిందే.