చంద్రబాబు కడుపు మంటకు కారణం ఇదేనా ?

నూరు రోజుల జగన్మోహన్ రెడ్డి పాలనపై చంద్రబాబునాయుడు మండిపోతున్న విషయం అందరికీ తెలిసిందే.  చంద్రబాబు దృష్టిలో పరిస్ధితి ఎలాగ తయారైందంటే జగన్ ఏదైనా పని చేసినా తప్పే ఏ పనీ చేయకపోయినా తప్పే. అందుకే జగన్ పాలనపై చంద్రబాబులో కడపుమంట అంటూ ఆరోపణలు మొదలయ్యాయి.

ఇదే విషయాన్ని డిప్యుటి సిఎంలు కూడా చెబుతున్నారు.  ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, నారాయణస్వామి, పాముల శ్రీ పుష్పవాణి, అంజాద్ భాష, ఆళ్ళ నాని మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపోయారు. జగన్ నూరు రోజు పాలనలో చంద్రబాబు కడపమంటతో ఇబ్బంది పడుతున్నారంటూ మండిపోయారు.

చెరువులో నుండి చేప ఒడ్డున పడితే ఎలా గిలగిల లాడిపోతుందో జగన్ పాలనలో చంద్రబాబు పరిస్ధితి ఇలాగే తయారైందంటూ ఎద్దేవా చేశారు.  పదేళ్ళ రాజధాని హైదరాబాద్ ను అర్ధాంతరంగా వదిలి వచ్చేసిన తుగ్లక్ గా చంద్రబాబును ఉప ముఖ్యమంత్రులు తీర్మానించేశారు. చంద్రబాబు రిలీజ్ చేసిన చార్జిషీటులో ఏమన్నా నిజాలున్నాయా అంటూ నిలదీశారు.

పించన్ల పెంపు,  ఉద్యోగులకు ఐర్ , విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్ మెంటు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఏర్పాటు,  అమ్మఒడి లాంటి అనేక పథకాలు అమలు కావటం చంద్రబాబుకు ఇష్టం లేదంటూ మండిపడ్డారు. మొత్తం మీద జగన్ పాలనపై చంద్రబాబు కడుపుమంటకు ఉప ముఖ్యమంత్రులు కారణాలు చెప్పేశారు.