ఆత్మహత్య చేసుకునే ముందు అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చివరిసారిగా ఎవరితో మాట్లాడారు ? ఏం మాట్లాడారు ? అన్న విషయాలు ఇపుడు చాలా కీలకంగా మారింది. అదే విషయాన్ని చేధించేందుకు పోలీసు అధికారులు దర్యాప్తును స్పీడ్ చేశారు. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కోడెల చివరిసారిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలోని ఓ లేడి డాక్టర్ తో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
ఓ లేడి డాక్టర్ తో కోడెల మాట్లాడటం అందులోను 24 నిముషాలు మాట్లాడటం ఇపుడు సంచలనంగా మారింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరైనా తమ కుటుంబసభ్యులు, ఆప్తులతోనో లేకపోతే సన్నిహితులతో మాట్లాడాలని అనుకుంటారు. కానీ కోడెల మాత్రం ఓ లేడి డాక్టర్ తో మాట్లాడారని తేలటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అంతసేపు కోడెల ఆ డాక్టర్ తో ఏం మాట్లాడారనే విషయం తేలటంతో సదరు డాక్టర్ తో మాట్లాడేందుకు పోలీసు అధికారులు రెడీ అవుతున్నారు. ఇక్కడ కోడెల మాట్లాడింది లేడీనా లేకపోతే జెంటా అనికాదు విషయం. డాక్టర్ తో మాట్లాడటమే విచిత్రంగా ఉంది. కోడెల దగ్గరున్న రెండు మొబైల్ ఫోన్లలో ఒకటి మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. దాని కోసం గాలిస్తున్నారు.
అయితే మిస్సయిన మొబైల్ ఫోన్ నెంబరు తెలుసు కాబట్టి కాల్ లిస్టును తెప్పించిన దర్యాప్తు బృందం దాని ఆధారంగా కాల్ డేటాను చెక్ చేసినపుడు లేడి డాక్టర్ తో మాట్లాడిన విషయం బయటపడింది. కాల్ డేటా అయితే బయటపడింది కానీ ఏం మాట్లాడారన్న విషయం సస్పెన్సుగానే ఉండిపోయింది. అది కూడా బయటపడితేనే కోడెల ఆత్మహత్య మిస్టరి విడిపోదు.