టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. గత కొన్ని రోజులుగా తన ఆరోగ్య పరిస్థితిని పాడ్‌కాస్ట్‌ల ద్వారా పంచుకుంటూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె మయోసైటీస్ కారణంగా రెండు సంవత్సరాలుగా సినిమాలకు విరామం తీసుకున్న ఆమె ఇటీవలే నిర్మాతగానూ మారింది. సమంత నిర్మాణంలో ‘శుభం’ సినిమా మే 9న విడుదలై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ మంచి స్పందన అందుకుంటోంది.
ఈ క్రమంలో సమంత తాజాగా ఓ పోస్ట్‌లో ‘నికోటినామైడ్ మోనోన్యూక్లియోటైడ్ (NMN)’ అనే సప్లిమెంట్లను ప్రమోట్ చేసింది. వీటి వాడకంతో శక్తి, ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొంది. అయితే దీనిపై ప్రముఖ గ్యాస్‌ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమంత తప్పుదారి పట్టిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వాస్తవానికి ఈ సప్లిమెంట్లపై శాస్త్రీయ ఆధారాలు ఎంతమేరకు ఉన్నాయన్నదిపై చర్చ మొదలైంది. దీనివల్ల శరీరం శోషణకు గురవుతుంది. అవయవాలకు చేరుతుందని ఎటువంటి ఆధారాలు లేవు అని పెట్టాడు.
అంతేకాకుండా దీనికి సంబంధించిన పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. కొన్ని లక్షలమంది ఫాలోవర్స్‌ను సమంత మోసం చేస్తుదని అన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఫ్రాడ్ సప్లిమెంట్లను ప్రచారం చేస్తున్నందుకు సమంతను తిట్టిపోస్తున్నారు. దీంతోసోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. అభిమానులు, నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.