కేటీఆర్ పై ఎమ్మెల్యేల ఒత్తిడి .. కారణం అదేనా?

లేటెస్ట్ గా తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీ ఘన విజయం సాధించి వీలైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 120 మున్సిపాలిటీ లకు గాను 104 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే 9 కార్పొరేషన్స్ ను కైవసం చేసుకున్న తెరాస పురపాలికల్లో తమ పార్టీ కి ఉన్న క్రేజ్ విషయంలో ఫుల్ జోష్ మీదున్నారు కానీ ఈ విషయంలోనే కేటీఆర్ టెన్షన్ లో ఉన్నాడట. దానికి కారణం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటిలను అభివృద్ధి చేస్తామని పురపాలక మంత్రి, తెరాస వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ హామీ ఇచ్సినా దానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం బాగానే నిర్వహించి .. పార్టీ విజయానికి కృషి చేసారు. అయితే ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో తప్పకుండా చెప్పినవన్నీ చేయాల్సిందే అని ఎమ్మెల్యే లు పట్టుబడుతున్నారట.

చెప్పిన హామీలను నెరవేర్చాలంటే ఈ సారి బడ్జెట్ లో ఎక్కువగా మున్సిపాలిటీలకు కేటాయించాలి. కార్పొరేషన్స్ అభివృద్ధి కోసం ఇప్పటికిప్పుడు నిధులు కావాల్సిందే .. అంటే వచ్చే బడ్జెట్ లో మున్సిపాలిటీలను టార్గెట్ చేసి ఎక్కవుగా బడ్జెట్ పెట్టేలా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు కేటీఆర్ పైనే ఉంది. ఒకవేళ చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలంటే తడిసి మోపాడవుతుంది. మరి ఈ విషయంలో ఏమి చేయాలా అన్న ఆలోచనలో కేటీఆర్ ఉన్నారట. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కేటీఆర్ చుట్టూ రోజు తిరుగుతున్నారట. తమ మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో బడ్జెట్ ఇవ్వమని, మరి ఈ నెల మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి .. ఈ బడ్జెట్ లో మున్సిపాలిటీ లకోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తారు అన్నది ఇప్పుడు కేటీఆర్ ను టెన్షన్ పెడుతున్న ప్రశ్న.

ప్రస్తుతం ఈ విషయం గురించే ఎక్కవుగా తెరాస పార్టీలో చర్చలు ఘాటుగా సాగుతున్నాయి. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తగినంత బడ్జెట్ కేటాయించని పక్షంలో కొందరు మేయర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యే లనుండి ఒత్తిడి పేరుంటుంది. దాంతో తెరాస పార్టీలో ముసలం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు . దానికి తోడు తెరాస పార్టీ పై ప్రజల్లో కూడా అనుమానాలు మొదలయి.. ఆ తరువాత పార్టీ ఉనికికే ప్రమాదం అయ్యేలా ఉంది పరిస్థితి.