చైనాతో పటు ప్రపంచాన్ని వణికిస్తూన్న కరోనా వైరస్ ధాటికి మరో 57 మంది బలయ్యారు .. దాంతో ఇప్పటూ కరోనా వైరస్ భారిన పడి 361 మంది మృతి చెందినట్టు అక్కడి వైద్య ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇప్పటికే చైనాలో ఇంతకుముందే వ్యాపించిన స్పేర్ వైరస్ మరణాలను మ్మించిపోయింది కరోనా వైరస్. ఈ వైరస్ భాదితులు రోజు రోజుకు పెరుగుతున్నారంటూ పేర్కొంది. నిన్న ఒక్క రోజే కొత్తగా దాదాపు 3000 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. ఈ కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుందని చైనా ఆరోగ్య వర్గాలు ప్రకటించాయి.
మొత్తంగా ఇప్పటికే చైనా లో దాదాపు 18000 మంది వరకు ఈ వ్యాధి భారిన పడినవారు ఉన్నారు. ఎప్పటికప్పుడు చైనా ప్రభుత్వం వ్యాధి సోకినా వారి వివరాలను వెల్లడిస్తునే ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చైనా వెళ్లే విమానాలను చాలా వరకు ఆపేసాయి వివిధ దేశాలు. ఇక చైనా నుండి ఇండియాకు వస్తున్న వారిపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కల్లోలం ఇటు ఇండియాను కూడా టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే కేరళ లో ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్టు అక్కడి ఆరోగ్య శాకా ప్రకటించడం కల్లోలం రేపుతోంది.