ఎవరపాలనుకున్న వైస్ జగన్ ఆగేలా లేడు !

Pothireddy Padu Irrigation Project
వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో ఊహించని రీతిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.  మొన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం సరైన నిర్ణయం కాదని హైకోర్ట్ చెప్పినా పక్కకుతోసేసి జనం కోరుకుంటున్నారు చేయాల్సిందే అంటూ ముందుకెళుతున్న జగన్ ఈసారి రాయలసీమ కోసం దూకుడు ప్రదర్శిస్తున్నారు.  శ్రీశైలంకు కుడి కాలవకు రోజుకు మూడు టీఎంసీల నీటిని తీసుకెళ్ళడానికి ఏపీ నిర్మించదలచిన కొత్త ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణతో వాడీ వేడి వార్ జరుగుతోంది.  వైఎస్ జగన్ కేసీఆర్ నోటీసుకు వెళ్లకుండానే జీవో నెం 203ను విడుదలచేశారు. 
 
దీంతో తెరాసతో పాటు తెలంగాణలోని ఇతర రాజకీయ పార్టీలన్నీ ఏపీ చేపట్టదలచిన ప్రాజెక్ట్  తెలంగాణకు అన్యాయం చేసేలా ఉందని వాదిస్తున్నాయి.  కేసీఆర్ అయితే ప్రాజెక్ట్ కడితే కోట్లాటే అంటూ సంకేతాలిచ్చారు.  ఇక బీజేపీ అయితే కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నుండి ప్రాజెక్ట్ పనులు తక్షణం ఆపాలని ఆర్డర్స్ తెచ్చేశారు.  కృష్ణా రివర్ బోర్డ్ సైతం ఏపీకి అనుకూలంగా లేదు.  సాధారణంగా అయితే ఇన్ని అడ్డంకుల మధ్య ఏ రాష్ట్రమైనా ప్రాజెక్టును హోల్డులో పెడుతుంది.  కానీ ఇక్కడ ఉన్నది వైఎస్ జగన్.. వెనక్కు తగ్గే ప్రసక్తే లేదంటున్నారాయన. 
 
ఎవరి ఎన్ని అభ్యంతరాలు చెప్పిన కృష్ణా నీటిలో తమకున్న హక్కు మేరకే ప్రాజెక్ట్ కడతాం అంటూ టెండర్లు పిలవడానికి రెడీ అయ్యారు.  ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.6,829.15 కోట్లు.  ఇందులోనే ఎత్తిపోతల పథకం, కాలువల విస్తరణ పనులు కూడా ఇందులోనే ఉంటాయి.  అయితే దీన్ని రెండు ప్యాకేజిలుగా విభజించారు.  మొదటి ప్యాకేజీలో మోటార్లు, పంప్ హౌసులు, పైప్ లైన్లు ఉంటే రెండో ప్యాకేజిలో పోతిరెడ్డిపాడు నుండి ప్రాజెక్టులకు నీటిని తరలించే కాలువల విస్తరణ పనులు ఉంటాయి.  
 
వీటన్నింటికీ రివర్స్ టెండరింగ్ ద్వారా టెండర్లు పిలవనున్నారు.  జ్యుడిషియల్‌ ప్రివ్యూ పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఆమోదం చెప్పిన వెంటనే టెండర్ల ప్రక్రియ నిర్వహించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.  అయితే ప్రాజెక్ట్ చుట్టూ ఇన్ని అభ్యంతరాలు నెలకొన్న తరుణంలో వైఎస్ జగన్ చకచకా యంత్రాంగాన్ని సంసిద్దం చేస్తూ ఉండటం అందరిలోనూ ఆసక్తిని పెంచింది.  మరి కేసీఆర్, కృష్ణా రివర్ బోర్డ్, కేంద్ర జలవనరుల శాఖ జగన్ దూకుడుకు ఎలా స్పందిస్తారో చూడాలి.