రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలోను ఎన్నో విధాలుగా ప్రచారం చేసుకుంటాయి. అందులో తమను తాము చాలా గొప్పగా చిత్రీకరించుకుంటాయి. అన్నీ పార్టీలు చేసేదదే కాబట్టి అందులో తప్పు పట్టాల్సిన పనికూడా ఏమీ లేదు. ఓటరు చాలా తెలివైన వాడు కాబట్టి ఏ పార్టీని ఆధిరించాలో ముందే డిసైడ్ అయిపోయుంటారు. కాబట్టి చేసుకున్న ప్రచారం మొత్తం గంగలో పోసినట్లే అవుతుంది.
ఇదంతా ఎందకంటే జగన్మోహన్ రెడ్డిని గబ్బు పట్టించేందుకు టిడిపి నేతలు తాజాగా విడుదల చేసిన ఓ వీడియా మిస్ ఫైరై వాళ్ళకే చుట్టుకున్నది కాబట్టి. వరదల సమయంలో ప్రభత్వం సహాయ కార్యక్రమాలేవీ చేయలేదని చెబుతూ ఓ రైతు జగన్ తో పాటు మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పై చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రచారంలో ఉంది.
వీడియో అలా ప్రచారంలోకి వచ్చిందో లేదో వెంటనే అది ఫేక్ వీడియో అని వైసిపి సోషల్ మీడియా వర్గాలు పట్టేశాయి. ఎందుకంటే జగన్ , అనీల్ పై నోటికొచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి అసలు రైతు కానే కాదు. ఎన్నికల సమయంలో టిడిపికి మద్దతుగా వీడియోల్లో నటించిన ఓ పెయిడ్ ఆర్టిస్ట్. అదే పెయిడ్ ఆర్టిస్ట్ తో ఇపుడు లోకేష్ అండ్ టీం జగన్, అనీల్ ను తిట్టించారన్న విషయం బయటపడిపోయింది.
ఇక్కడే చంద్రబాబు, చినబాబుతో పాటు టిడిపి నేతల చవకబారుతనం బయటపడింది. ఎన్నికల సమయంలో అంటే తమ గొప్పలు చెప్పుకోవటం కోసం ప్రత్యర్ధులను కూడా తక్కువగా చూపించటం మామూలే. కానీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న తర్వాత కూడా చవకబారు తెలివి తేటలను ఉపయోగిస్తే వర్కవుటవదని తెలుసుకోకపోతే ఎలా ?