నలభై ఏళ్ళు రాజకీయ జీవితంలో బాబుగొరిని ‘అపర చాణిక్యుడు’ అని కీర్తిస్తూ ఉంటారు. అయినా ఏం లాభం ఆ ‘అపర చాణిక్యుడు’ను మట్టి కరిపించి అధికారికం దక్కించుకున్న నేర్పరి జగన్. ‘తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు’ అనే సామెత జగన్ కరెక్ట్ గా సరిపోతొంది. మైండ్ గేమ్ లో బాబుని మించినోళ్లు ఇండియాలోనే లేరని.. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే లేరని పచ్చ తమ్ముళ్ల నమ్మకం. కానీ, ఇప్పుడు మైండ్ గేమ్ లో బాబునే మించిపోతున్నాడు జగన్.
జగన్ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించబోతున్నాడట. మరి టీడీపీలో మిగిలిన ముఖ్య నేతలు ఆపరేషన్ ఆకర్ష్ లో ఆకర్షితులవుతున్నారా.. సమాధానం అవుననే అనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో కాస్త బలం ఉన్న నాయకులను తమవైపు తిప్పుకోవడానికి వైసీపీ నాయకులు గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారట. ప్రకాశం జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల్లో ఓడిపోయిన టీడీపీ నేతలతో పాటు గెలిచిన ఒక నేత కూడా పార్టీ మార్పు ఖాయం అని విస్తృత చర్చ నడుస్తోంది.
ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే బలరాంను చేర్చుకోవవడం ద్వారా టీడీపీ శ్రేణుల్లో కలకలం సృష్టించింది వైసీపీ. ఇప్పుడు మిగిలిన నాయకుల పై దృష్టి సారించింది. వీరిలో గుంటూరు జిల్లాలోని ఒక ఎమ్మెల్యేను సంప్రదించినట్లు సమాచారం. అలాగే మరో ఇద్దరు నాయకులకు వ్యాపారపరమైన సమస్యలు చూపించి బెదిరించి తమవైపు తిప్పుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జగన్ తన మైండ్ గేమ్ తో టీడీపీ నేతలతో పాటు ఆ పార్టీ క్యాడర్ ను కూడా గందరగోళంలో పడేస్తున్నారు.
ఇప్పటికే విషయం తెలుసుకున్న టీడీపీ అగ్రనేతలు రెండ్రో జులుగా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. అంతా అయిపోయాక దృష్టి సారించినా సాధించేది ఏముంది..? అయినా ఇలాంటి మైండ్ గేమ్ లో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారు. పాపం అలాంటి మైండ్ గేమ్ తోనే చంద్రబాబును ఇప్పుడు జగన్ ముప్పుతిప్పలు పెడుతున్నాడు.