‘రాయలసీమకు అధికార ప్రతిపక్షాలు రెండూ ద్రోహం చేస్తున్నాయి‘

కడప ఉక్కు కోసం ప్రతిపక్షాలు మొన్న కడప జిల్లా బంద్ కు పిలుపు నిచ్చినాయి. సీమ ఉక్కు కోసం ఉద్యమించడం మంచి పరిణామమే అయినా మొదట రాష్ట్రబంద్ అని తర్వాత సీమ బంద్ అని చివరకు జిల్లా బంద్ కు పరిమితం చేసినారు. బంద్ లు చేయాలనడం ఇక్కడ ఉద్దేశం కాదు. నాడు విశాఖ ఉక్కు కోసం రాష్ట్ర పోరాటంగా మార్చిన పార్టీలు నేడు సీమకు ఉపయోగపడే కడప ఉక్కు కోసం మాత్రం జిల్లా పోరాటంగా మార్చడం మాత్రమే అభ్యంతరం. నాడు మాత్రమే కాదు నేడు కూడా మధ్య కోస్తాకు ఉపయోగపడే పోలవరం, రాజధాని, హోదా ఇలా ఆ ప్రాంతానికి ఉపయోగపడే అంశాల మీద ఆంధ్రుల హక్కు అని పోరాడుతున్న అధికార, విపక్షాలు రాయలసీమకు ఉపయోగపడే ఉక్కు, సీమ ప్యాకేజీ, మన్నవరం చివరకు దుగిరాజ పట్నం విషయంలో మాత్రం సంబందిత జిల్లాకే పరిమితం కావడం వివక్ష కాక మరేమౌతుంది. దీని వెనక ఉన్న రాజకీయాల మీద రాయలసీమ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి వీడియో విశ్లేషణ.