బిగ్ బాస్ షో లో రేవంత్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా మంచి గుర్తింపు పొందిన రేవంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి సింగర్ గా గుర్తింపు పొందిన రేవంత్ ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. 100 పైగా పాటలు పాడి ఇండియన్ ఐడల్ గా నిలిచిన రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొదటి వారం నుండి మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో ఆక్టివ్ గా పర్ ఫార్మ్ చేస్తూ కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తూ టైటిల్ విన్నర్ గా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

అయితే ప్రతివారం రేవంత్ తన ప్రవర్తనతో నామినేషన్స్ లో ఉన్నా కూడా తన అభిమానుల మాత్రం ఓటింగ్ తో రేవంత్ ని సేవ్ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతివారం అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో నిలుస్తున్న రేవంత్ రెమ్యూనరేషన్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ యాజమాన్యం వారు ఇతర కంటెస్టెంట్లతో పోల్చితే రేవంత్ కి అత్యధికంగా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం బిగ్ బాస్ షో లో రేవంత్ ఒక రోజుకి 60 వేల నుంచి 70 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న రేవంత్ ఈ సీజన్ సిక్స్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో మొదటి వరుసలో ఉంటూ టైటిల్ విన్నర్ గా నిలుస్తాడని అతని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రేవంత్ టైటిల్ విన్నర్ గా నిలుస్తాడో? లేదో? చూడాలి మరి.