జబర్దస్త్ కమెడియన్లకు కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కలిసొస్తుందా… జబర్దస్త్ షోకి కష్టమేనా?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో దాదాపుగా పది సంవత్సరాలుగా ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎంతోమంది కొత్త వారి టాలెంట్ నిరూపించుకొని అవకాశాన్ని కల్పించే జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా పాపులర్ అయ్యి ఆ తర్వాత వారికి గుర్తింపు తెచ్చి పెట్టిన జబర్దస్త్ షో కి దూరమవుతున్నారు. ఇలా జబర్దస్త్ ని కమెడియన్ల ప్రొడక్షన్ హౌస్ అని అనటంలో సందేహం లేదు. ఇలా జబర్దస్త్ ద్వారా కొంతవరకు పాపులర్ అవ్వగానే సినిమాలలో అవకాశాలు దక్కించుకొని జబర్దస్త్ కి దూరమవుతున్నారు దీంతో ప్రతి ఏడాది జబర్దస్త్ లో కొత్త కొత్త వారిని తీసుకోబోతున్నారు. తాజాగా జబర్దస్త్ కామెడీ షో కి కొత్త వారిని ఆహ్వానించడానికి మల్లెమాల అధికారికంగా ఆడిషన్స్ నిర్వహించింది.

ఈ ఆడిషన్స్ కి మొత్తం 3,000 మంది హాజరు కావడంతో వారిని ఎలా ఆడిషన్స్ చేయాలో అర్థం కాక జబర్దస్త్ యాజమాన్యం వారు తలలు పట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఆహా వేదికగా “కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్” అనే ఒక కామెడీ షో ఆహాలో ప్రారంభం కానుంది. ఈ కామెడీ షోలో జబర్దస్త్ నుండి బయటికి వచ్చి ఇతర చానల్స్ లో సందడి చేసిన కమెడియన్లు అందరూ సందడి చేయబోతున్నారు. సుడిగాలి సుదీర్ ఈ షో కి మూల స్తంభంలా నిలబడి షో కొనసాగిస్తాడని సమాచారం. అయితే ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షో ప్రారంభం అయితే జబర్దస్త్ కి పెద్ద దెబ్బ పడుతుందని కొందరు భావిస్తున్నారు.

అన్ స్టాపబుల్ షో లాగే ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షో కూడా పాపులర్ అయితే ప్రస్తుతం జబర్దస్త్ నుండి బయటికి వెళ్లలేక అక్కడ ఉండలేక ఇబ్బంది పడుతున్న జబర్దస్త్ కమెడియన్లకు కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక మంచి ప్లాట్ ఫామ్ మారనుందని … ఇప్పటికే కామెడీ స్టార్స్ కోసం జబర్దస్త్ కి దూరమైన కమెడియన్లందరూ ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ సోలో సందడి చేయబోతున్నారు. సుధీర్ మెయిన్ రోల్ లో సందడి చేయనున్న ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే షో హిట్ అయితే మాత్రం జబర్దస్త్ కి మళ్ళీ కష్టకాలం ఏర్పడుతుందని సినీ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.