గతవారం నామినేషన్ల సందర్భంగా బిగ్ హౌస్‌లో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. హౌస్‌లోని ఆల్ మెన్‌తో లహరి బిజీగా ఉంటోంది.. అంటూ కంటెస్టెంట్ ప్రియ, తన తోటి కంటెస్టెంట్ అయిన లహరి మీద ఆరోపణలు చేయడంలో భాగంగా, లేట్ నైట్, వాష్ రూమ్‌లో రవితో హగ్.. అనే టాపిక్ నొక్కి నొక్కి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా, రవి, ప్రియ, లహరి.. ఇలా వీరి మధ్య పెద్ద వివాదమే నడిచింది. అయితే, ఈ వివాదానికి అసలు రీజన్ రవి అనే సంగతి అప్పుడే అందరికీ అర్ధమైపోయింది కూడా. హౌస్‌లో చాలా మంది సింగిల్ మెన్ ఉన్నారు. వారినందర్నీ వదిలిపెట్టి, లహరి నా వెనకాల పడుతోంది.. అవకాశాల కోసమే అలా చేస్తోంది.. అని ప్రియతో రవి డిస్కస్ చేసిన వీడియో క్లిప్‌ని రిలీజ్ చేసి, లహరితో పాటు, ఆడియన్స్‌కీ క్లారిటీ ఇచ్చేశాడు బిగ్‌బాస్.
కానీ, అనూహ్యంగా లహరి ఎలిమినేషన్ మాత్రం జరిగిపోయింది. నిజంగానే లహరిని ఆడియన్స్ బయటికి పంపించేశారా.? కానే కాదు. తనపై పడిన నింద కారణంగా ఆ నామినేషన్ తర్వాత లహరి హౌస్‌లో ఉండలేకపోయిందట. హౌస్‌లో తాను ఇకపై కంటిన్యూ కాలేనని ఏడ్చేసిందట. బిగ్‌బాస్ నిర్వాహకులతో పాటు, హోస్ట్ నాగార్జున, ఇదంతా గేమ్‌లో వన్ ఆఫ్ ది పార్ట్ అంతే.. అని ఈ విషయమై లహరిని కన్విన్స్ చేసేందుకు ట్రై చేశారట. కానీ, లహరి కన్విన్స్ కాలేదట. దాంతో ఆ విషయంలో పూర్తిగా తప్పు రవిదే అని తేల్చేసి, లహరిని బయటికి పంపించేశారట. అదీ అత్యంత గౌరవంగా.. అని ఓ టాక్ నడుస్తోంది. అయితే, ఈ టాక్‌లో నిజమెంతో తెలీదు కానీ, ఇంత జరిగాకా కూడా హౌస్‌లో రవిని ఇంకా కొనసాగించడం ద్వారా బిగ్‌బాస్ తన స్థాయిని తగ్గించేసుకుందన్న విమర్శలూ గట్టిగానే వినిపిస్తుండగా, మరోవైపు హోస్ట్ నాగార్జునపైనా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.