తను ఫేమస్ కావడానికి కారణం ఆ ఇద్దరు వ్యక్తులు అంటున్న బిగ్ బాస్ బ్యూటీ లహరి!

బిగ్ బాస్ 5 సీజన్లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన యాక్టర్, న్యూస్ రీడర్, జర్నలిస్ట్, మోడల్ అయిన నటి లహరి శరీ. వస్తునే నాగ్ కు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయడం అలాగే అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ తన సొంతమని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. లహరి శరీ జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి మోడలింగ్ లోను సత్తా చాటింది. ఆ తరువాత యాంకర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన లహరి శరీ ఆపై నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

కొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. ఆ తరువాత జనసేన పార్టీ కోసం తన ఉద్యోగాన్ని వదులుకొని ప్రచారం కూడా చేసింది ఈమె. ఇక లహరి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె జూన్ 5న 1995లో హైదరాబాదులోనే జన్మించింది. చిన్న వయసులోనే మాడలింగ్ లో కెరియర్ స్టార్ట్ చేసింది. ఆమె తనకు తానే ఇండస్ట్రీలో వచ్చిందని వారి ఫ్యామిలీ వాళ్ళకి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదని చెప్పింది. ఇండస్ట్రీకి రావడానికి చాలా కష్టపడ్డాను అని తెలిపింది.

తరువాత వాళ్ళ ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు అన్నారు. మనలో మనకి కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధిస్తాం అని తెలిపింది. నేను మూవీస్ లో అవకాశాలు రావడంతో నేను న్యూస్ జాబ్ రిజైన్ చేశానని తెలిపింది. న్యూస్ చాట్ చేస్తున్నప్పుడు మూవీస్ లో చేయడానికి తక్కువ అవకాశాలు వచ్చాయని చెప్పుకుంటువచ్చింది. అందుకే న్యూస్ రీడర్ గా రిజైన్ చేశాను అని చెప్పింది. కత్తి మహేష్ గారు పవన్ కళ్యాణ్ కి కార్నర్ చేస్తున్నప్పుడు నేను వాయిస్ రైస్ చేశాను.

ఇంటర్వ్యూ తర్వాత కత్తి మహేష్ గారు మంచి స్నేహితుడు అయ్యారు. ఆయనతో కలిసి రెండు చిత్రాలను కూడా చేశాను. మన ఇంటరాక్షన్ మాత్రం ఆ ఇంటర్వ్యూ తోనే మొదలయ్యింది. నేను ఫేమస్ కావడానికి కారణం పవన్ కళ్యాణ్ ఇంకా కత్తి మహేష్ అనీ అందరికీ ఈ విషయాన్నీ ఆమె తెలిజేశారు. బిగ్ బాస్ లో ఒక గొడవ అవ్వడం వల్ల ఫేమస్ అయ్యాను. శ్రీ రెడ్డి పోరాడిన దానికి నేను సపోర్ట్ చేయను అని చెప్పడం జరింగింది. ఆయితే శ్రీ రెడ్డి వెళ్ళిన దారి కరెక్ట్ కాదని ఆ దారిని నేను సపోర్ట్ చేయనని చెప్పారు.

శ్రీ రెడ్డి చేసిన పని ఏది కరెక్ట్ కాదని అని కూడా చెప్పింది.
ఇండస్ట్రీలో  నాకు ఎవ్వరు స్నేహితులు లేరని తెలిపింది. ఇండస్ట్రీ వాళ్ళతో కూర్చొని మాట్లాడడం గాని వాళ్లతో అడగడం గానీ ఇదేం లేవు. నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు అంత బెస్ట్ ఫ్రెండ్ అని అనుకొని సపోర్ట్ చేసినవారు అయినా నా ఫ్యామిలీ నాకు అన్ని అని చెప్పుకుంటు వచ్చింది.

నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు నా ఫ్యామిలీ తప్ప..

అందరూ చెప్తున్నా రూమర్స్ నిజం కాదు. నాకు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద ఫ్యామిలీస్ తో రిలేషన్ ఉందని చెప్తు ఉంటారు కానీ అవన్నీ నాకు లేవని చెప్పారు. నేను సెట్ కి వెళ్తే స్టార్టింగ్ లో హాయ్ ఇంకా వెళ్తున్నప్పుడు బాయ్ అంతే మాట్లాడతాను. కానీ వాళ్లతో కూర్చుని మాట్లాడడం గాని ఇంకోటి ఇంకోటి అలాంటివి చేయను అన్నారు. నాపై చాలామంది కుళ్లుకుంటున్నారు అని వార్త అయితే వచ్చింది. కానీ నేను చెప్పేది ఒకటే ఒక మనిషి మనతో ఏ విధంగా మనల్ని చూస్తారో అదే విధంగా మాట్లాడుతారు అని తన అభిప్రాయాలను తెలిపింది.